'మాయాబజార్' పై వినోదపు పన్ను విధింపు
రంగులద్ది, ఆధునిక టెక్నాలిజీ జతచేసి విడుదల చేసిన 'మాయాబజార్' సినిమాకు ప్రభుత్వం ఇకపై పూర్తి వినోదపు పన్ను వసూలు చేయాలని నిర్ణయించింది. మొదట వినోదపు పన్ను తగ్గించినప్పటికీ ధియోటర్ యజమానులు ఆ మేరకు సినిమా టిక్కెట్ల ధరను తగ్గించకపోవటం వల్లే ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. 'మాయాబజార్' రీరిలీజ్ కు వినోదపు పన్నును మినహాయిస్తున్నట్లు జనవరి 29వ తేదీన ఉత్తర్వు ఇచ్చింది. పన్నులో ఏ మేరకు మినహాయింపు ఇచ్చిందీ ఉత్తర్వుల్లో స్పష్టంగా లేనందువల్ల పూర్తిగా రద్దు చేయాలంటూ ఇటీవల ప్రభుత్వానికి మరో అభ్యర్థన వచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి. పాక్షిక మినహాయింపునకు తగినట్లుగా టిక్కెట్ల ధరలను తగ్గించలేదని అప్పటికే ఫిర్యాదులు రావటంతో, ఇచ్చిన మినహాయింపును కూడా రద్దు చేయాలంటూ అధికారులు ప్రభుత్వానికి సూచించారు.మాయాబజార్ కలర్ వెర్షన్ అందరి మన్ననలు అందుకుంది. ఎన్టీఆర్,ఎ ఎన్నార్, సావిత్రి, ఎస్వీఆర్ వంటి ప్రముఖులు నటించిన ఆనాటి క్లాసిక్ ఇప్పటికీ వీకెండ్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడవటం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











