సుధీర్ బాబు హీరోగా ‘మాయదారి మల్లిగాడు’ ప్రారంభం
హైదరాబాద్ : 'ప్రేమ కథా చిత్రమ్'తో హిట్ కొట్టిన మహేష్ బాబు బావ సుధీర్ బాబు త్వరలో 'మాయదారి మల్లిగాడు' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి సూపర్ స్టార్ కృష్ణ క్లాప్ కొట్టారు. దర్శకుడు రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా హాజరైన కెమెరా స్విచాన్ చేసారు.
'మాయదారి మల్లిగాడు' అనేది సూపర్ స్టార్ కృష్ణ నటించిన చిత్రం టైటిల్. 1973లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో కృష్ణ, మంజుల జంటగా ఈ చిత్రం రూపొందింది. టైటిల్ క్యాచీగా ఉండటంతో పాటు, మామయ్య సినిమా పేరుతో సినిమా తీస్తే మంచి రెస్పాన్స్ వస్తుందనే ఉద్దేశ్యంతో సుధీర్ బాబు స్వయంగా తన తర్వాతి చిత్రానికి ఈ టైటిల్ సెలక్ట్ చేసుకున్నట్లు స్పష్టం అవుతోంది.
ఇటీవల విడుదలైన 'ప్రేమ కథా చిత్రమ్'లో కృష్ణ నటించిన 'పచ్చని కాపురం' చిత్రంలోని 'వెన్నలైనా చీకటైనా' పాటను రీమిక్స్ చేయడం సుధీర్ బాబుకు కలిసొచ్చింది. బహుషా ఆ సెంటిమెంటుతోనే మామయ్య సినిమాలపై సుధీర్ బాబు కన్నుపడినట్లు స్పష్టమవుతోంది.

సుధీర్ బాబు హీరోగా రూపొందబోయే ‘మాయదారి మల్లిగాడు' చిత్రం ద్వారా హనుమాన్ అనే కొత్త దర్శకుడు వెండితెరకు పరిచయం కాబోతున్నాడు.

రేవన్ కుమార్ ఈచిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. కృష్ణ నటించిన పాత ‘మాయదారి మల్లిగాడు'కు అపకీర్తి రాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.

‘మాయదారి మల్లిగాడు' చిత్రం ప్రారంభోత్సవానికి సూపర్ స్టార్ కృష్ణ, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, మంచు లక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు

ఇప్పటి ట్రెండు, సుధీర్ బాబు బాడీ లాంగ్వేజ్‌కు తగిన విధంగా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఇది పాత ‘మాయదారి మల్లిగాడు' చిత్రానికి రీమేక్ మాత్రం కాదని స్పష్టమవుతోంది.

కృష్ణ కుటుంబంతో సుధీర్ బాబు బంధుత్వం గురించి మాట్లాడుకుంటే....కృష్ణ చిన్నకూతురు ప్రియదర్శినితో 2006లో సుధీర్ బాబు వివాహం జరిగింది.

సుధీర్ బాబు-ప్రియదర్శినిలకు చరిత్ మానస్, దర్శన్ అనే ఇద్దరు పిల్లలున్నారు. ప్రస్తుతం సుధర్ బాబు వయసు 36 సంవత్సరాలు.


Click it and Unblock the Notifications











