సుధీర్ బాబు సరసన అల్లరి నరేష్ హీరోయిన్
'మాయదారి మల్లిగాడు' సినిమా పేరుతో సుధీర్ బాబు మామయ్య అయిన సూపర్ స్టార్ కృష్ణగారు అప్పట్లో ఒక సినిమా చెయ్యడం గమనార్హం. ఈ సినిమాతో హనుమాన్ అనే ఒక కొత్త దర్శకుడు పరిచయం కానున్నాడు. ఆ మధ్య ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. అది అందరి మన్ననలు పొందింది. ఇందులో సుధీర్ బాబు చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. రేవన్ కుమార్ ఈ సినిమాకు నిర్మాత. రాదన్ సంగీతం అందిస్తున్నాడు.
'మాయదారి మల్లిగాడు' అనేది సూపర్ స్టార్ కృష్ణ నటించిన చిత్రం టైటిల్. 1973లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో కృష్ణ, మంజుల జంటగా ఈ చిత్రం రూపొందింది. టైటిల్ క్యాచీగా ఉండటంతో పాటు, మామయ్య సినిమా పేరుతో సినిమా తీస్తే మంచి రెస్పాన్స్ వస్తుందనే ఉద్దేశ్యంతో సుధీర్ బాబు స్వయంగా తన తర్వాతి చిత్రానికి ఈ టైటిల్ సెలక్ట్ చేసుకున్నట్లు స్పష్టం అవుతోంది. ఇటీవల విడుదలైన 'ప్రేమ కథా చిత్రమ్'లో కృష్ణ నటించిన 'పచ్చని కాపురం' చిత్రంలోని 'వెన్నలైనా చీకటైనా' పాటను రీమిక్స్ చేయడం సుధీర్ బాబుకు కలిసొచ్చింది. బహుషా ఆ సెంటిమెంటుతోనే మామయ్య సినిమాలపై సుధీర్ బాబు కన్నుపడినట్లు స్పష్టమవుతోంది.


Click it and Unblock the Notifications












