అల్లు అర్జున్‌ని ఆ చిత్రంలో చూశా, మతిపోయింది.. ఒక్కసారి కలవాలి.. గల్లీ బాయ్ నటుడు!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తెలుగులోనే కాదు మలయాళంలో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న హీరో. బన్నీ డాన్సులకు చాలా మంది అభిమానులు ఉంటారు. అల్లు అర్జున్ స్టైల్ ని అభిమానులతో పాటు సెలెబ్రటీలు కూడా ఇష్టపడుతుంటారు. ఇప్పటికే టైగర్ ష్రాఫ్ లాంటి నటులు అల్లు అర్జున్ డాన్సుల గురించి ప్రశంసించారు. తాజాగా మరో బాలీవుడ్ నటుడు బన్నీకి అభిమానిగా మారాడు. ఇటీవల విడుదలైన గల్లీ బాయ్ చిత్రంతో గుర్తింపు సొంతం చేసుకున్న సిద్దార్థ్ చతుర్వేది ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అల్లు అర్జున్ కు తాను పెద్ద ఫ్యాన్ ని అని తెలిపాడు.

తొలిసారి ఆర్య చిత్రం
నా కాలేజ్ రోజుల్లో నేను చూసిన అల్లు అర్జున్ తొలి చిత్రం ఆర్య. ఆ చిత్రంలో అల్లు అర్జున్ పెర్ఫామెన్స్ నా మతిపోగొట్టింది. అప్పటి నుంచి అల్లు అర్జున్ డాన్స్ వీడియోలు చూడడం ప్రారంభించానని సిద్దార్థ్ చతుర్వేది చెబుతున్నాడు. ఇటీవల లవర్ ఆల్సో, బ్లాక్ బస్టర్ సాంగ్స్ చూశానని సిద్దార్థ్ చతుర్వేది తెలిపాడు. బన్నీ స్టెప్పులు, స్టైలిష్ లుక్ వేరే లెవల్ లో ఉంటుందని అన్నాడు. అల్లు అర్జున ఒక స్టైల్ ఐకాన్ అని సిద్దార్థ్ తెలిపాడు.

అల్లు సర్ అంటూ
అల్లు సర్ మిమ్మల్ని ఒక్కసారైనా కలవాలి అని.. ఈ సారి హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తా అని తెలిపాడు. రెండు సింహాలు కలిస్తే ఆ మజానే వేరు అని తెలిపాడు. ఇటీవల సిద్దార్థ్ హైదరాబాద్ లో ఓ ఈవెంట్ కు హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. గల్లీ బాయ్ చిత్రంలో సిద్దార్థ్ ఎంసీ షేర్ పాత్రలో నటించారు. ఇప్పుడు అంతా అతడిని షేర్ అనే పిలుస్తున్నారు.

క్రేజీ నటుడిగా
జోయా అక్తర్ దర్శత్వంలో తెరకెక్కిన గల్లీ బాయ్ చిత్రం ఫిబ్రవరిలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది రణవీర్ సింగ్, అలియా భట్ నటించిన ఈ చిత్రంలో సిద్ధార్థ్ కీలక పాత్రలో నటించాడు. బుల్లితెర నుంచి వచ్చిన సిద్దార్ట్ గల్లీ బాయ్ చిత్రంతో క్రేజీ నటుడిగా మారిపోయాడు. గల్లీ బాయ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.

ఆలస్యమవుతూనే ఉంది
ఇదిలా ఉండగా అల్లు అర్జున్ కొత్త చిత్రం ఇంకా ఆలస్యం అవుతూనే ఉంది. నా పేరు సూర్య చిత్రం తర్వాత బన్నీ మరో చిత్రాన్ని ప్రారంభించలేదు. జనవరిలో బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ అంటూ ప్రకటన వచ్చింది. కానీ త్రివిక్రమ్ ఇంకా కథకు తుదిమెరుగులు దిద్దుతూనే ఉన్నాడు. ఇటీవల సుకుమార్ కూడా బన్నీతో ఓ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అల్లు అరవింద్, రాధాకృష్ణ కలసి నిర్మించే త్రివిక్రమ్ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందో అనిఫాన్స్ ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











