అల్లు అర్జున్ కోసం ఏడాది పాటు కష్టపడి.. క్యూలో క్రేజీ దర్శకులు!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్, రాధాకృష సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జనవరిలోనే ఈ చిత్రానికి ప్రకటన జరిగింది. కానీ ఇంతవరకు సెట్స్ పైకి వెళ్లలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంకా కథపై కసరత్తు చేస్తూనే ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలు ప్రకటిస్తామని చిత్రయూనిట్ తాజాగా తెలిపింది. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ సైలెంట్‌గా తన తదుపరి ప్రాజెక్ట్స్‌ని సెట్ చేసుకుంటున్నాడు.

 హ్యాట్రిక్ కాంబినేషన్

హ్యాట్రిక్ కాంబినేషన్

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ చిత్రం రాబోతోంది. వీరి కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు మంచి విజయం సాధించాయి. నా పేరు సూర్య చిత్రం నిరాశపరిచిన తర్వాత బన్నీ మరో చిత్రాన్ని ప్రారంభించలేదు. త్రివిక్రమ్ దర్శత్వంలో తెరకెక్కే చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అభిమానులకు ఈ సారి మంచి చిత్రాన్ని అందించాలని బన్నీ పట్టుదలతో ఉన్నాడు.

సుకుమార్ దర్శత్వంలో

సుకుమార్ దర్శత్వంలో

త్రివిక్రమ్ దర్శత్వంలో చితం పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. సుకుమార్, బన్నిలది కూడా హ్యాట్రిక్ కాంబినేషనే. రంగస్థలం లాంటి భారీ విజయం తర్వాత సుకుమార్ అల్లు అర్జున్ తో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. అల్లు అర్జున్ చేతిలో ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు ఉన్నాయి.

 ఎంసీఏ దర్శకుడితో

ఎంసీఏ దర్శకుడితో

నాపేరు సూర్య చిత్రం నిరాశపరిచిన తర్వాత అల్లు అర్జున్ కొందరు కొత్త దర్శకులు చెప్పే కథలని సైతం వింటున్నాడు. ఎంసీఏ, ఓమై ఫ్రెండ్ లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వేణు శ్రీరామ్ ఇటీవల అల్లు అర్జున్ ని కలసి ఓ కథ వినిపించాడట. వేణు శ్రీరామ్ ఈ కథని ఏడాది పాటు కష్టపడి బన్నీ కోసం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వేణు శ్రీరామ్ వినిపించిన స్టోరీ చాలా ఆసక్తికరంగా ఉండడంతో అల్లు అర్జున్ వెంటనే అంగీకారం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.

దిల్ రాజు నిర్మాణంలో

దిల్ రాజు నిర్మాణంలో

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సుకుమార్ కూడా ప్రస్తుతం అల్లు అర్జున్ కోసం కథ సిద్ధం చేస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. విక్రమ్ కుమార్ కూడా బన్నీని మెప్పించే కథని సిద్ధం చేస్తున్నాడట. అల్లు అర్జున్ కోసం ఇలా దర్శకులు వరుసగా క్యూ కడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X