నాని ‘ఎంసీఏ-మిడిల్ క్లాస్ అబ్బాయి’ ట్రైలర్ అదుర్స్
Recommended Video

నేచురల్ స్టార్ నాని, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి). శ్రీరామ్ వేణు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మాతలు. ఈ సినిమా డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. తాజా గా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు.
ట్రైలర్ అదుర్స్
తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. మిడికల్ క్లాస్ ఫ్యామిలీ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. వదిన, మరిది అనుబంధాన్ని ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో వదిన పాత్రలో బూమిక, మరిది పాత్రలో నాని నటిస్తున్నాడు.

బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కూడా
మిడిల్ క్లాస్ రిలేషన్స్‌పై చాలా సినిమాలు వచ్చాయి. కానీ వదిన, మరిది మధ్య అనుబంధంపై సినిమాలు వచ్చి చాలాకాలమైంది. ఈ సినిమా భూమిక వదినగా కనపడుతుంది. ఇందులో మధ్య తరగతి కుటుంబ సభ్యుల మధ్య రిలేషన్, డ్రామా అంతా కనపడుతుంది. వీటితో పాటు బ్యూటిఫుల్ లవ్‌స్టోరి ఉంటుంది. సాయిపల్లవి ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది అని నిర్మాత దిల్ రాజు తెలిపారు.

ఆ సీన్స్ చూసి ఆడియెన్స్ ఎగ్జయిట్ అవుతారు
ఫిదా చిత్రంతో మా బ్యానర్‌లో నటించిన సాయిపల్లవి, ఈ సినిమాలో నటిచడం పెద్ద ప్లస్ పాయింట్. నాని, సాయిపల్లవిల మధ్య ఉండే సీన్స్ చూసి ఆడియెన్స్ ఎగ్జయిట్ అవుతారు. సినిమాలో విజయ్ వర్మ విలన్‌గా కనిపిస్తాడు. అన్ని కోణాలు ఈ సినిమాలో ఉంటాయని దిల్ రాజు తెలిపారు.

ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా ఉంటుంది
సమీర్‌రెడ్డి అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. డైరెక్టర్ వేణు మిడిల్ క్లాస్ కుర్రాడు కాబట్టి, ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా సీన్స్‌ను రాసుకున్నాడు. అన్ని మ్యాజిక్ వర్కవుట్ అయితే సినిమా పెద్ద హిట్ సాధిస్తుంది. డిసెంబర్ 16న ప్రీ రిలీజ్ వేడుకను ప్లాన్ చేస్తున్నాం. డిసెంబర్ 21న ప్రేక్షకులు ఏం చెబుతారని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నామని దిల్ రాజు తెలిపారు.


Click it and Unblock the Notifications











