ఎంసీఏ మూవీ ప్రివ్యూ: నాని, సాయిపల్లవి కెమిస్ట్రీ.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ

ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) చిత్రంలో నాని, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో భూమిక కీలక పాత్రను పోషించారు. ఈ చిత్రం డిసెంబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ నేపథ్యంలో..

By Rajababu

శతమానం భవతి అంటూ 2017 సంవత్సరంలో హిట్ కొట్టిన ప్రముఖ దిల్ రాజు సక్సెస్ జోరు ఈ ఏడాది చివరి వరకు సాగింది. నేను లోకల్, దువ్వాడ జగన్నాథం, ఫిదా, రాజా ది గ్రేట్ లాంటి బ్లాక్‌బస్టర్లు అందుకొన్నారు. ఇలాంటి ఘన విజయాల తర్వాత వస్తున్న చిత్రం ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి). ఈ చిత్రంలో వరుస విజయాలు అందుకొంటున్న నాని, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో భూమిక కీలక పాత్రను పోషించారు. ఈ చిత్రం డిసెంబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ నేపథ్యంలో ఎంసీఏ చిత్ర విశేషాలు మీకోసం...

మిడిల్ క్లాస్ స్టోరీ..

మిడిల్ క్లాస్ స్టోరీ..

ఎంసీఏ చిత్రం పక్కా మధ్య తరగతి కుటుంబ నేపథ్యంగా రూపొందింది. నాని మిడిల్ క్లాస్ యువకుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో వదినా, మరిది మధ్య జరిగే భావోద్వేగ సన్నివేశాల కూర్పే ఈ చిత్రం కథ.

మధ్య తరగతి మనస్తత్వం

మధ్య తరగతి మనస్తత్వం

మధ్య తరగతి కుటుంబంలో ఉండే పరిస్థితులు కళ్లకు కట్టినట్టు ట్రైలర్‌లో చూపించారు. పని మనిషులు, నానీ కూరగాయలు తేవడం, పాల ప్యాకెట్లు పట్టుకురావడం సాధారణ ప్రేక్షకులే కాదు.. క్లాస్ ఆడియెన్స్‌కు హత్తకునే అంశాలు.

నానితో సాయిపల్లవి కెమిస్ట్రీ

నానితో సాయిపల్లవి కెమిస్ట్రీ

ఇక ప్రేమించుకొందామా పెళ్లి చేసుకొందామా? పెళ్లి విషయం ఏం చేశావు య అని నాని సాయి పల్లవి ఆటపట్టించడం, వారి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు కెమిస్ట్రీకి అద్దంపట్టాయి. ఈ అంశాలు యువతి, యువకులను ఆకర్షిస్తాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

వదిన, మరిది మధ్య బంధం

వదిన, మరిది మధ్య బంధం

ఇక ఇంట్లో వదిన, మరిది మధ్య జరిగే చిన్న చిన్న తగాదాలను చూపించారు. కోపంలో వదినను ఆమె అని సంభోదించడం లాంటి సన్నివేశాలు కనిపించాయి. అలాంటి వాతావరణంలో వదినపై కొందరు ఎటాక్ చేయడం చూసిన నాని వారిని ఇరుగదీశాడు.

 కుటుంబం జోలికి వస్తే

కుటుంబం జోలికి వస్తే

ఏదైనా విభేదాలు ఉంటే ఇంటి వరకే.. కుటుంబం జోలికి వస్తే తాట తీసే పాత్రను నాని పోషించినట్టు కనిపించింది. అర్దరూపాయి ధర పెరిగితేనే రోడ్లమీదకు వచ్చే మధ్య తరగతి వాళ్లం. మా కుటుంబం జోలికి వస్తే ఊరుకొంటామా అని నాని హెచ్చరించడం యూత్‌ను ఆకట్టుకుంటుంది.

సక్సెస్‌తో దూసుకెళ్తున్ననాని..

సక్సెస్‌తో దూసుకెళ్తున్ననాని..

నాని, దిల్‌రాజు, సాయి పల్లవి వీరింతా 2017‌లో సక్సెస్‌తో దూసుకుపోతున్నారు. ఇలాంటి కాంబినేషన్‌తో వస్తున్న చిత్రం ఎంసీఏ. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ చక్కని బాణీలు సమకూర్చారు. చక్కటి కుటుంబ కథా చిత్రానికి దర్శకుడు వేణు శ్రీరాం మెరుగులు దిద్దాడు.

 ఐదేళ్ల తర్వాత వేణు శ్రీరాం

ఐదేళ్ల తర్వాత వేణు శ్రీరాం

శృతిహాసన్, సిద్ధార్థ్ కాంబినేషన్‌లో ఓ మై ఫ్రెండ్ చిత్రాన్ని రూపొందించాడు వేణు శ్రీరాం. దాదాపు ఐదేళ్ల తర్వాత మళ్లీ ఎంసీఏ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ క్రమంలో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X