ఎంసీఏ ట్విట్టర్ రివ్యూ: ఫస్టాఫ్ బాగుంది.. సెకండాఫ్.. నానిని నుంచి..
వరుస సక్సెస్‌లతో అదరగొడుతున్న నాని, సాయి పల్లవి నటించిన ఎంసీఏ (మిడిల్ క్లాస్) మూవీ డిసెంబర్ 21న రిలీజ్ అయింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ షోలు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రదేశాల్లోనే కాకుండా అమెరికాలో డిసెంబర్ 20 తేది అర్ధరాత్రే ప్రదర్శింపబడ్డాయి. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో వచ్చిన ఈ చిత్రంపై సోషల్ మీడియాలో ప్రేక్షకులు తెలిపిన అభిప్రాయాలు మీకోసం..
Recommended Video


మిక్స్‌డ్ రెస్పాన్స్
ఎంసీఏ చిత్రంలో సాయి పల్లవి, నాని జోడి బాగుంది. సెంటిమెంటల్ సీన్లు అదిరిపోయాయి. ఫస్ట్ హాఫ్ మంచిగా ఉంది. సెకండాఫ్ కొంత డల్ అయింది. రొటీన్ ఫార్మాలా చిత్రం అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

ఫస్టాఫ్ బాగుంది
ఎంసీఏ సినిమా తొలి భాగం అదిరిపోయింది.

నాని, సాయి పల్లవికి బిగ్గెస్ట్ హిట్
నాని కెరీర్‌లో ఎంసీఏ మరో బిగ్గెస్ట్ హిట్. సాయిపల్లవి, నాని యాక్టింగ్ బాగా ఉంది. మంచి వినోదాత్మక చిత్రం

ఫ్యామిలీని మెప్పించే
తమిళంలో శివకార్తీకేయన్, తెలుగులో నానికి ఒకేరకమైన క్రేజ్ ఉంది. కామెడీ, క్లీన్ క్యారెక్టర్‌తో పిల్లలను, ఫ్యామిలీని మెప్పిస్తారు..

ఎగ్జయిటింగ్‌గా.. ఆందోళనగా ఉంది
ఎంసీఏ చిత్రం రిలీజ్ ముందు చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. నా సినిమా రిలీజ్‌కు ముందు ఉండే కొంత ఆందోళనగా కూడా ఉంది. మీకు ఎంసీఏ సినిమా నచ్చుతుంది అని అనుకొంటున్నాను. అలాగే నా సోదర సమానుడు అఖిల్ అక్కినేని హలో సినిమా బాగుండాలి. భారీ సక్సెస్ సాధించాలి అని నాని ట్వీట్ చేశాడు.

రొటీన్ మూవీ
యావరేజ్ మూవీ, అదే పాత, రొటీన్ ఫార్మూలా సినిమాలా ఉంది.
బిగ్గెస్ట్ ఫ్లాప్
నాని కెరీర్‌లో ఓ రాడ్ మూవీ. ఎంసీఏ బిగ్గెస్ట్ ఫ్లాప్
మిడిల్ క్లాస్ మాదిరిగానే
ఎంసీఏ సినిమా కూడా మిడిల్ క్లాస్ మాదిరిగానే దారుణంగా ఉంది.
క్లీన్ బోల్డ్
ఆరో బంతికి దిల్ రాజు క్లీన్ బోల్డ్ అయ్యారు.. ఎంసీఏ గురించి ఓ నెటిజన్ అభిప్రాయం ఇది.
నాని ఇక రొటీన్ సినిమాలు ఆపాలి
నాని ఇలాంటి రొటీన్ మూవీస్ చేయడం ఆపాలి. ఈ సినిమాలో ప్రతీది ముందే ఊహించినట్టుగా ఉంటుంది. పాటలు చాలా దారుణంగా ఉన్నాయి.
డీఎస్పీ ఆడియో రొటీన్
దేవీ శ్రీ ప్రసాద్ పాటలు, సంగీతం చాలా రొటీన్‌గా ఉంది. షిప్ట్, డిలీట్ కొట్టండి అంటూ మరొ నెటిజన్ కామెంట్ విసిరాడు.
యావరేజ్ మూవీ..
ఫస్టాఫ్ యావరేజ్ కంటే తక్కువే. సెకండాఫ్ బాగా లేదు.. ఫ్లాప్ మూవీ. నాని నుంచి రొటీన్, రెగ్యులర్ స్టఫ్ ఊహించలేదు. కొత్తగా ఏమీ లేదు. స్క్రిప్ట్ సెలక్షన్ బాగాలేదు


Click it and Unblock the Notifications











