twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దిమ్మతిరిగేలా నాని సినిమా బిజినెస్.. రిలీజ్‌కు ముందే రికార్డు కనకవర్షం..

    టాలీవుడ్‌లో ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఉన్న నేచురల్ స్టార్ నాని ఇప్పుడు స్టార్ హీరో అనే ముద్ర వేసుకొన్నాడు. వరస విజయాలను సొంతం చేసుకొంటూ డబుల్ హ్యాట్రిక్‌కు పరుగులు పెడుతున్నాడు.

    By Rajababu
    |

    టాలీవుడ్‌లో ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఉన్న నేచురల్ స్టార్ నాని ఇప్పుడు స్టార్ హీరో అనే ముద్ర వేసుకొన్నాడు. వరస విజయాలను సొంతం చేసుకొంటూ డబుల్ హ్యాట్రిక్‌కు పరుగులు పెడుతున్నాడు. దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నాని నటిస్తున్న ఎంసీఏ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ సినీ వర్గాలను ఆశ్చర్యపరిచేలా ఉందంటూ ఓ వార్త మీడియా సర్కిళ్లలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. అదేమిటంటే..

     ఎంసీఏలో సాయి పల్లవి, నాని

    ఎంసీఏలో సాయి పల్లవి, నాని

    ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ సెకండ్ వెంచర్ ఎంసీఏ. ఫిదాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన సాయిపల్లవి, నాని హీరో హీరోయిన్లు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌పై నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న ఈ చిత్రం డిసెంబర్ 21న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.

     25 కోట్ల బిజినెస్

    25 కోట్ల బిజినెస్

    ఇక చిత్రానికి సంబంధించిన బిజినెస్ నాని కెరీర్‌లోనే ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ఈ చిత్రం రూ.25 కోట్ల మేర బిజినెస్ చేసినట్టు వినికిడి.

     అత్యధిక ధరకు శాటిలైట్

    అత్యధిక ధరకు శాటిలైట్

    ఎంసీఏ శాటిలైట్ రైట్స్ కూడా మంచి ధర పలికినట్టు ఓ మాట వినిపిస్తున్నది. ప్రముఖ టెలివిజన్ ఛానెల్ ఎంసీఏ శాటిలైట్ హక్కులను ఏకంగా రూ.6 కోట్లు చెల్లించి దక్కించుకొన్నట్టు సమాచారం.

     డిజిటిల్ రైట్స్ కూడా మంచి

    డిజిటిల్ రైట్స్ కూడా మంచి

    ఇంటర్నెట్ యుగంలో సినిమాలకు భారీగానే బిజినెస్ సమకూరుతున్నది. డిజిటల్ రైట్స్ పేరుతో సినిమాకు మంచి వ్యాపారం జరుగుతున్నది. ఇక డిజిటల్ రైట్స్ పేరుతో ఎంసీఏకు రూ.5.5 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్టు తెలిసింది. ప్రముఖ ఆన్‌లైన్, డిజిటల్ కంపెనీ ఈ హక్కులను దక్కించుకొన్నట్టు సమాచారం.

     40 కోట్లు వస్తే గానీ

    40 కోట్లు వస్తే గానీ

    ఇలా అన్ని లెక్కలు చూస్తే నాని కెరీర్ మంచి రేంజ్‌లోనే ఉన్నట్టు స్పష్టమవుతున్నది. నాని సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఇప్పటివరకు జరిగిన బిజినెస్ చూస్తే ఎంసీఏ సుమారు రూ. 40 కోట్లు వసూలు చేస్తే గానీ సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా డిస్టిబ్యూటర్లు కూడా బయటపడే అవకాశం ఉంది.

    English summary
    Nani's latest movie is MCA. Fidaa fame Sai Pallavi is the lead heroine. Devi Sri Prasad is the music director. This movie is produced under ace producer Dil Raju's Venkateshwars Banner. This movie is set to release on 21 December. Latest news about this movie is, MCA has done good numbers of pre release business.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X