సాయి పల్లవి నానిని డామినేట్ చేస్తుందా?; స్టార్ హీరోతో నేచురల్ స్టార్ మల్టీ స్టారర్..
ఫిదా సినిమాతో అచ్చ తెలంగాణ అమ్మాయిలా అందరినీ మెస్మరైజ్ చేసిన సాయిపల్లవి మరోసారి తెలంగాణ అమ్మాయి పాత్రలో నటిస్తున్న చిత్రం ఎంసీఏ. ఫిదాలో నిజామాబాద్ బిడ్డగా అదరగొట్టిన సాయిపల్లవి.. ఈసారి వరంగల్ బిడ్డగా అలరించనుంది.
సినిమాకు సంబంధించి చాలావరకు సీన్స్ వరంగల్ బ్యాక్ డ్రాప్ లోనే జరుగుతాయన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎంసీఏ ప్రీ-రిలీజ్ వేడుకను కూడా వరంగల్ వేదికగా నిర్వహించాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్‌లో నేటి సాయంత్రం ప్రీ-రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నారు.
Recommended Video


సాయిపల్లవి డామినేట్ చేస్తుందా?:
ఫిదాలో పక్కింటి అమ్మాయి తరహా పాత్రలో చూపు తిప్పుకోనివ్వకుండా చేసిన సాయి పల్లవి.. ఎంసీఏలోను హీరో పాత్రను డామినేట్ చేసేలా కనిపిస్తోంది. మిడిల్ క్లాస్ అబ్బాయి తరహా పాత్రలో నాని బాగానే ఒదిగిపోయినట్లు కనిపిస్తున్నాడు. ఇద్దరూ సహజ నటనకు పెట్టింది పేరు కావడంతో.. ఆన్ స్క్రీన్ వీరిద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది. సాయి పల్లవి నానిని డామినేట్ చేస్తుందా?.. లేక ఇద్దరి పాత్రలను డైరెక్టర్ బ్యాలెన్స్ చేశారా? అన్నది స్క్రీన్ మీదే చూడాలి.

ఎన్&ఎన్ మల్టీ స్టారర్:
వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని సినిమాల ఎంపికలోను వేరియేషన్స్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన మల్టీ స్టారర్ సినిమాకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. నాగార్జునతో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి బ్యానర్ లో నాని నటించనున్నారు. వైవిధ్యమైన సినిమాలకు ఎప్పుడూ ముందుండే నాగార్జున.. నానితో కలిసి నటించనుండటం సినిమాపై అంచనాలను పెంచుతోంది.

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో:
భలే మంచి రోజు, శమంతకమణి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకన్న శ్రీరామ్ ఆదిత్య నాని-నాగార్జునల మల్టీస్టారర్ కు దర్శకుడిగా వ్యవహరించనున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.

ఫిబ్రవరి నుంచి షూటింగ్?
నాని నాగార్జున(ఎన్&ఎన్) మల్టీ స్టారర్ పై ఆ చిత్ర దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య నమ్మకంగా ఉన్నారు. స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయిందని, ప్రస్తుతం నాని, నాగార్జున బిజీగా ఉండటంతో ఫిబ్రవరి మొదటి వారంలో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తామని అన్నారు. నిర్మాత అశ్వనీదత్ సహకారం మరిచిపోలేనని చెప్పారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో సినిమా చేయడం సంతోషంగా ఉందన్నారు.


Click it and Unblock the Notifications











