వీధి చివ‌ర ఉంటాదో టీ కొట్టు : మిలియన్ వ్యూస్ దాటిన ఎంసీఏ సాంగ్

"పాస్‌బుక్‌లో పైస‌ల క‌న్నా ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్ ఎక్కువ" అనే పాట‌లోని రెండు లైన్ల‌ను నాని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొంటూ ఎంసీఏ సినిమాలోని పాట‌ను విడుద‌ల చేశాడు.

Recommended Video

మిలియన్ వ్యూస్ దాటిన MCA సాంగ్

గ‌త రెండేళ్లుగా వ‌రుస విజ‌యాల‌తో నాని దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. 'భ‌లే భ‌లే మ‌గాడివోయ్' నుంచి 'నిన్ను కోరి' వ‌ర‌కు వ‌రుస‌గా ఆరు విజ‌యాల‌ను సొంతం చేసుకున్న ఈ యువ క‌థానాయ‌కుడు.. ప్ర‌స్తుతం వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఎం.సి.ఎ' (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమా చేస్తున్నాడు. 'ఫిదా' ఫేమ్ సాయిప‌ల్ల‌వి ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. సీనియ‌ర్ హీరోయిన్ భూమిక ఓ కీల‌క పాత్ర పోషిస్తోంది. సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది.

 పిన్నీస్‌ పెట్టుకుని మ్యానేజ్‌ చేశావా?

పిన్నీస్‌ పెట్టుకుని మ్యానేజ్‌ చేశావా?

ఇటివలే ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. "ఎప్పుడైనా షర్ట్‌ బటన్‌ వూడిపోతే పిన్నీస్‌ పెట్టుకుని మ్యానేజ్‌ చేశావా? మామూలు జీన్స్‌ని బ్లేడ్‌తో కట్‌ చేసి టోర్న్‌ జీన్స్‌లా కలర్‌ ఇచ్చావా? అంతెందుకు ఎప్పుడైనా అలా రోడ్డుపై వెళుతూ బస్‌స్టాప్‌లో ఓ అందమైన అమ్మాయిని చూసి ఇద్దరు ముగ్గురు పిల్లలతో ఓ ఫ్యామిలీ ఫొటోను వూహించుకున్నావా? ఇవన్నీ చేసుంటే తెలిసేది ఎంసీఏ అంటే మిడిల్‌ క్లాస్‌ అబ్బాయని అని ఓ డైలాగ్ చెప్పాడు నాని. ఇప్పటికైతే మంచి పాజిటివ్ బజ్ తోనే సాగుతోందీ సినిమా..

 వీధి చివ‌ర ఉంటాదో టీ కొట్టు

వీధి చివ‌ర ఉంటాదో టీ కొట్టు

నిన్ననే ఈ సినిమాలోని టైటిల్ సాంగ్‌ని విడుద‌ల చేశారు. 'వీధి చివ‌ర ఉంటాదో టీ కొట్టు.. ఆడ మేం తాగే టీ ఏమో వ‌న్ బై టూ' అంటూ సాగుతోన్న ఈ సాంగ్ అదుర్స్ అనిపిస్తోంది. ప్ర‌తి చ‌ర‌ణం చివ‌ర 'మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం ఎమ్‌సీఏ' అంటూ సాగుతోంది. అప్పుడే మిలియన్ వ్యూస్ దాటేసింది.

ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్ ఎక్కువ

ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్ ఎక్కువ

'పాస్‌బుక్‌లో పైస‌ల క‌న్నా ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్ ఎక్కువ' అనే ఈ పాట‌లోని రెండు లైన్ల‌ను నాని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొంటూ ఈ పాట‌ను విడుద‌ల చేశాడు. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వ‌హిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘ఫిదా' సినిమా హీరోయిన్ సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.

డిసెంబర్ 15న విడుదల

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు కాబట్టి మ్యూజికల్ గా కూడా ఈ చిత్రంపై మంచి హోప్స్ పెట్టుకున్నారు ప్రేక్షకులు. నూతన దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 15న విడుదల చేయాలని నిర్ణయించిన టీమ్ ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X