వైరస్ వ్యాప్తిలో మహేష్ నెం.1, పవన్ కళ్యాణ్ నెం. 4

By Bojja Kumar

హైదరాబాద్: ఇంటర్నెట్ లేనిదే పొద్దు గడవని రోజులివి. తమ అభిమాన హీరోల గురించిన వివరాలు, సినిమాలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి యూత్ ఎక్కువగా ఇంటర్నెట్ మీదనే ఆధార పడుతున్నారు. ఈ క్రమంలో వారికి సంబంధించిన కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు వైరస్ భారిన పడుతున్నాయి.

ఈ వైరస్‌ను వ్యాపింప జేయడంలో తెలుగు సినిమా స్టార్లయిన మహేష్ బాబు నెం.1 స్థానంలో ఉంటే, ప్రభాస్ రెండో స్థానంలో ఉన్నాడు. తర్వాతి స్థానంలో ఎన్టీఆర్ ఉండగా, నాలగులో స్థానంలో పవన్ కళ్యాణ్, ఐదో స్థానంలో రవితేజ ఉన్నారు. ప్రముఖ యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ ఉత్పత్తి సంస్థ ‘మెకాఫే' స్టీడీలో ఈ విషయం వెల్లడయింది.

అభిమానులు ఆయా హీరోలకు సంబంధించిన వాల్ పేపర్లు, వీడియోలు వెతికే క్రమంలో వైరస్ వ్యాప్తి చెందుతోందట. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన పూర్తి వివరాలు...

మహేష్ బాబు

మహేష్ బాబు

మహేష్ బాబుకు సంబంధించిన సినిమాలు, ఇతర వివరాలు తెలుసుకునే క్రమంలో....65 రకాల ప్రమాదకరమైన లింకులు పొంచి ఉన్నాయట. ఆగడు సినిమా గురించిన సెర్చ్‌లో ఇది ఎక్కువగా ఉన్నాయట.

ప్రభాస్

ప్రభాస్

ప్రభాస్ గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేసినపుడు 64 రకాల ప్రమాదకరమైన వైరస్ సైట్లు గుర్తించారట. ముఖ్యంగా బాహుబలి గురించి వెతికినపుడు ప్రమాదం ఎక్కువ అని తెలుస్తోంది.

జూ ఎన్టీఆర్

జూ ఎన్టీఆర్

నందమూరి యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ పేరుతో 62 ప్రమాదకరమైన లింకులు ఉన్నాయని, ముఖ్యంగా రభస సినిమాలోని ‘రాకాసి రాకాసి' సాంగు డౌన్ లోడ్ చేసినపుడు ఈ ప్రమాదం ఎక్కువ అని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఈ విషయంలో కాస్త వెనకబడి 4వ స్థానంలో ఉన్నారు. ఆయన పేరుతో ఇంటర్నెట్లో 59 రకాల ప్రమాదాలు పొంచి ఉన్నాయట.

రవితేజ

రవితేజ

మాస్ మహారాజ రవితేజ పేరుతో 58 రకాల వైరస్ లు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X