ఒకే గదిలో ఉన్నాం, అది గుర్తొస్తే తారక్ ను తిట్టుకుంటా: రాజమౌళి
హైదరాబాద్: టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి 15 ఏళ్ల క్రితం 'స్టూడెంట్ నెం.1' సినిమా ద్వారా దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆయన తొలి సినిమాలో హీరో జూ ఎన్టీఆర్. అంతకు ముందే ఓ సినిమాతో ఎన్టీఆర్ లాంచ్ అయినా... తొలి విజయం రుచి చూసింది మాత్రం 'స్టూడెంట్ నెం.1' సినిమాతోనే.
ఈ రోజుతో 'స్టూడెంట్ నెం.1' మూవీ రిలీజ్ అయి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాజమౌళి అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. ట్విట్టర్ ద్వారా ఆయన ఈ విషయాలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ట్వీట్లపై ఓ లక్కేద్దాం..
డైరెక్టర్‌గా 15, ఇండస్ట్రీకొచ్చి 25 ఏళ్లు
‘దర్శకుడిగా నేను పరిచయమై 15 ఏళ్లు అయ్యింది. కానీ నేను ఎడిటింగ్ అసిస్టెంట్‌గా చేరి 25 ఏళ్లు అయ్యింది. వినడానికి చాలా కాలంలా ఉంది. కానీ అలా అనిపించడం లేదు అని రాజమౌళి ట్వీట్ చేసారు.
తారక్, నేను ఒకే గదిలో
నాకు, తారక్‌కి స్విట్జర్లాండ్‌లో ఒకే గది ఇచ్చారు. నేను 9 గంటలకల్లా నిద్రపోతాను. అతడు 12 గంటల వరకు టీవీ చూస్తాడు. అది కూడా వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాలు అంటూ రాజమౌళి ట్వీట్ చేసారు.
అది గుర్తొస్తే తనని తిట్టుకుంటా
అక్కడ ప్రసారం అయ్యే ఒకే ఒక్క ఛానల్ అది.. స్విస్ భాషలో. ఇప్పటికీ అది గుర్తొస్తే తనని తిట్టుకుంటా రాజమౌళి అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు.
ఆ క్రెడిట్ నాది కాదు
‘స్టూడెంట్ నం.1' విజయం క్రెడిట్‌ని.. కథ రాసిన పృథ్వీతేజకి, సంగీతం సమకూర్చిన కీరవాణికి ఇస్తాను. కొన్ని సన్నివేశాల్లో తారక్ చక్కని నటనను చూడొచ్చు కానీ అప్పటి అతడు బుడ్డింగ్ యాక్టర్ అని రాజమౌళి తెలిపారు.
ఎమెచ్యూరిష్‌గా
ఆ సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్ ఇపుడు చూసినపుడు అపుడు నా దర్శకత్వం ఎమెచ్యూరిష్‌గా ఉందనిపిస్తుంది అని రాజమౌళి అభిప్రాయ పడ్డారు.
అది చూడటం అదృష్టం
మేము విజయయాత్రకు వెళ్లినప్పుడు ప్రజలు తారక్‌ను హీరోగా స్వీకరించడం ప్రారంభించడాన్ని చూశాను. వయసుపైబడినవాళ్లు కూడా ఈ 19 ఏళ్ల కుర్రాడ్ని చూడడానికి వచ్చారు. అది ఓ మంచి అనుభవం. ఆ సినిమాలో కొత్తగా పనిచేసిన మాలాంటివాళ్లందరం ఆ అవకాశం పొందినందుకు అదృష్టవంతులం' అని రాజమౌళి ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











