వీడియో ఎడిట్ చేసి తప్పుగా చూపించారు: జర్నలిస్టుపై ప్రీతి జింతా ఫైర్!
బాలీవుడ్ నటి ప్రీతి జింతాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'మీటూ' ఉద్యమం గురించి ప్రీతి జింతా మాట్లాడిన ఈ వీడియో క్లిప్ చూసిన నెటిజన్లు ఆమెపై మండి పడుతున్నారు. ఇందులో మీటూ ఉద్యమాన్ని, సెక్సువల్ హరాస్మెంట్ బాధితులను బ్లేమ్ చేస్తున్నట్లు ప్రీతి వ్యాఖ్యలు ఉండటమే ఇందుకు కారణం.
ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో క్లిప్ మీద ప్రీతి జింతా స్పందించారు. తన ఫుల్ ఇంటర్వ్యూ నుంచి కొంత భాగాన్ని వివాదాస్పదంగా కట్ చేసి తనను నెగెటివ్‌గా ఫోకస్ చేశారని మండి పడ్డారు. తన ఇంటర్వ్యూ తీసుకున్న జర్నలిస్ట్.... వివాదాస్పదంగా ఎడిట్ చేసి వైరల్ చేయడం తనను ఎంతగానో అప్ సెట్ చేసిందని ప్రీతి జింతా తెలిపారు.
విమర్శలకు కారణమైన ఆ వీడియోలో.... 'తనకూ మీ టూ అనుభవం ఎదురైతే బాగుండేదని, మీకు సరైన సమాధానం ఇచ్చేదాన్ని. మనం అవతలి వాళ్లను ఎలా చూస్తామో వారు మనల్ని అలాగే వాళ్లు చూస్తారు. స్వీటూ.. రేపటి మీ టూ కావచ్చు జాగ్రత్తగా ఉండండి అంటూ మీటూ ఉద్యమాన్ని, లైంగిక వేధింపులకు గురైన బాధితులను ప్రీతి జింతా హేళన చేస్తున్నట్లు' ఉంది.

ఈ వీడియోపై విమర్శలు రావడంతో.... ప్రీతి వివరణ ఇచ్చుకోక తప్పలేదు. ఆ రోజు తాను చాలా ఇంటర్వ్యూలు ఇచ్చానని, ఎక్కడా తాను అలా మాట్లాడలేదని ప్రీతి జింతా తెలిపారు. తన ఇంటర్వ్యూ వీడియోను వక్రీకరిస్తూ తనపై నెగెటివ ముద్ర పడేలా చేసిన జర్నలిస్టు మీద అసంతృప్తి వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











