»   » అల్లరి నరేష్ ‘మేడమీది అబ్బాయి’ పొజిషన్ ఏంటి?

అల్లరి నరేష్ ‘మేడమీది అబ్బాయి’ పొజిషన్ ఏంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  కామెడీ స్టార్ అల్లరి నరేష్...చాలా కాలంగా విజయాలు లేక పోవడమో? సినిమాలు తగ్గడమో? మరేదో తెలియదు కానీ ఈ మధ్య అల్లరి నరేష్ గురించి మీడియాలో వార్తలు చాలా తగ్గిపోయాయి. త్వరలో ఆయన 'మేడమీద అబ్బాయి' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

  జాహ్నవి ఫిల్మ్స్ పతాకంపై శ్రీమతి నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. నిఖిల విమల్ కథానాయిక. జి.ప్రజిత్ దర్శకత్వం వహిస్తున్నారు.చిత్రీకరణను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది.


  సున్నితమైన కథ

  సున్నితమైన కథ

  ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ నవ్యమైన కథ కథనాలతో దర్శకుడు చిత్రాన్ని చక్కగా రూపొందిస్తున్నాడు. గమ్యం శంభో శివ శంభో తర్వాత ఆ తరహా సున్నితమైన కథతో నరేష్ చేస్తున్న చిత్రమని తెలిపారు.


  CM KCR appreciates Fidaa Movie Cast and Crew
  అల్లరి నరేష్ శైలి వినోదం

  అల్లరి నరేష్ శైలి వినోదం

  రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో స్క్రీన్‌ప్లే హైలైట్‌గా వుంటుంది. సహజమైన అంశాలతో థ్రిల్లింగ్ వుంటూనే నరేష్ శైలి వినోదం వుంటుంది. నరేష్ కేరీర్‌లో మరపురాని చిత్రంగా ఇది నిలిచిపోతుందనే నమ్మకం వుందన్నారు నిర్మాత.


  ఆగస్టు రిలీజ్

  ఆగస్టు రిలీజ్

  త్వరలోనే టీజర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆగసు మొదటివారంలో పాటలను విడుదల చేసి, ఆగస్టు ద్వితీయార్థంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకరావడానికి ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు.


  తారాగణం

  తారాగణం

  అవసరాల శ్రీనివాస్, జయప్రకాష్, తులసి, సుధ, సత్యం రాజేష్, మధునందన్, జబర్దస్త్ ఆది, పద్మ జయంతి, రవిప్రకాష్, వెన్నెల రామారావు తదితరులు నటిస్తున్నారు.


  తెర వెనక

  తెర వెనక

  ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఉన్ని ఎస్ కుమార్, సంగీతం: షాన్ రెహమాన్, ఆర్ట్: రాజీవ్ నాయర్, ఎడిటర్: నందమూరి హరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.ఎస్.కుమార్, సమర్పణ: శ్రీమతి నీలిమ, నిర్మాత: బొప్పన చంద్రశేఖర్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.ప్రజిత్.  English summary
  It has been so long that we got to see our energetic actor, Allari Naresh, in full force. Currently, Allari Naresh is busy in ongoing project ‘Meda Meeda Abbayi’, the remake of Malayalam superhit film ‘Oru Vadakkan Selfie’.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more