Don't Miss!
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- News తనపై ఉన్న కేసుల వివరాలను వెల్లడించిన సీఎం జగన్
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అల్లరి నరేష్ ‘మేడమీది అబ్బాయి’ పొజిషన్ ఏంటి?
అల్లరి నరేష్ త్వరలో ‘మేడమీద అబ్బాయి’గా వస్తున్నాడు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది.
కామెడీ స్టార్ అల్లరి నరేష్...చాలా కాలంగా విజయాలు లేక పోవడమో? సినిమాలు తగ్గడమో? మరేదో తెలియదు కానీ ఈ మధ్య అల్లరి నరేష్ గురించి మీడియాలో వార్తలు చాలా తగ్గిపోయాయి. త్వరలో ఆయన 'మేడమీద అబ్బాయి' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
జాహ్నవి ఫిల్మ్స్ పతాకంపై శ్రీమతి నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. నిఖిల విమల్ కథానాయిక. జి.ప్రజిత్ దర్శకత్వం వహిస్తున్నారు.చిత్రీకరణను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది.
సున్నితమైన కథ
ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ నవ్యమైన కథ కథనాలతో దర్శకుడు చిత్రాన్ని చక్కగా రూపొందిస్తున్నాడు. గమ్యం శంభో శివ శంభో తర్వాత ఆ తరహా సున్నితమైన కథతో నరేష్ చేస్తున్న చిత్రమని తెలిపారు.
Recommended Video
అల్లరి నరేష్ శైలి వినోదం
రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో స్క్రీన్‌ప్లే హైలైట్‌గా వుంటుంది. సహజమైన అంశాలతో థ్రిల్లింగ్ వుంటూనే నరేష్ శైలి వినోదం వుంటుంది. నరేష్ కేరీర్లో మరపురాని చిత్రంగా ఇది నిలిచిపోతుందనే నమ్మకం వుందన్నారు నిర్మాత.
ఆగస్టు రిలీజ్
త్వరలోనే టీజర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆగసు మొదటివారంలో పాటలను విడుదల చేసి, ఆగస్టు ద్వితీయార్థంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకరావడానికి ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు.
తారాగణం
అవసరాల శ్రీనివాస్, జయప్రకాష్, తులసి, సుధ, సత్యం రాజేష్, మధునందన్, జబర్దస్త్ ఆది, పద్మ జయంతి, రవిప్రకాష్, వెన్నెల రామారావు తదితరులు నటిస్తున్నారు.
తెర వెనక
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఉన్ని ఎస్ కుమార్, సంగీతం: షాన్ రెహమాన్, ఆర్ట్: రాజీవ్ నాయర్, ఎడిటర్: నందమూరి హరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.ఎస్.కుమార్, సమర్పణ: శ్రీమతి నీలిమ, నిర్మాత: బొప్పన చంద్రశేఖర్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.ప్రజిత్.