twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లరి నరేష్ ‘మేడమీద అబ్బాయి’ ట్రైలర్

    అల్లరి నరేష్ మేడమీద అబ్బాయి ట్రైలర్ రిలీజైంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 8న రిలీజ్ చేయనున్నారు.

    By Bojja Kumar
    |

    అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మేడమీద అబ్బాయి. జాహ్నవి ఫిల్మ్స్ పతాకంపై శ్రీమతి నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. నిఖిల విమల్ కథానాయిక. జి.ప్రజిత్ దర్శకత్వం వహిస్తున్నారు.

    చిత్రీకరణను పూర్తిచేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 8న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ కొత్తదనంతో కూడిన కథతో చేస్తున్న విభిన్న చిత్రమిది. నరేష్ కెరీర్‌లో మరో మైలురాయిలా ఈ చిత్రం నిలిచిపోతుందనే నమ్మకం ఉందన్నారు.

    గమ్యం శంభో శివ శంభో తర్వాత ఆ తరహా సున్నితమైన కథతో నరేష్ చేస్తున్న చిత్రమిది. రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో స్క్రీన్‌ప్లే హైలైట్‌గా వుంటుంది. సహజమైన అంశాలతో థ్రిల్లింగ్ వుంటూనే నరేష్ శైలి వినోదం వుంటుంది. సెప్టెంబర 8వ తేదీన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకరావడానికి ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు.

    అవసరాల శ్రీనివాస్, జయప్రకాష్, తులసి, సుధ, సత్యం రాజేష్, మధునందన్, జబర్దస్త్ ఆది, పద్మ జయంతి, రవిప్రకాష్, వెన్నెల రామారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఉన్ని ఎస్ కుమార్, సంగీతం: షాన్ రెహమాన్, ఆర్ట్: రాజీవ్ నాయర్, ఎడిటర్: నందమూరి హరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.ఎస్.కుమార్, సమర్పణ: శ్రీమతి నీలిమ, నిర్మాత: బొప్పన చంద్రశేఖర్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.ప్రజిత్.

    English summary
    Allari Naresh's Meda Meeda Abbayi Theatrical Trailer released. MedaMeedaAbbayi latest 2017 Telugu movie ft. Allari Naresh and Nikhila Vimal. Directed by G Prajeeth and produced by Chandra Sekhar Boppana on Jaahnavi Fiilms banner. Music composed by Shaan Rahman.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X