బూతులు తిట్టారు: ఆ హీరో ప్రెస్ మీట్ బహిష్కరణ

By Bojja Kumar

హైదరాబాద్: బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ తన తాజా సినిమా ‘రాయ్' ప్రమోషన్లో భాగంగా ఇటీవల హైదరాబాద్ వచ్చారు. ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. అయితే ఈ చిత్ర పిఆర్ఓ మీడియా ఫోటోగ్రాఫర్ల పట్ల దురుసుగా ప్రవర్తించారు. వారిపై అసభ్యకరమైన లాంగ్వేజ్ వాడారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
పిఆర్ఓ తీరుతో మనస్తాపానికి గురైన ఫోటోగ్రాఫర్లు, మీడియా ప్రతినిధులు ఈ సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. తన ప్రమేయం లేకుండా జరిగిన ఈ పరిణామంపై అర్జున్ రాంపాల్ షాక్ అయ్యారు. అతను చాలా డిసప్పాయింట్ అయినట్లు ఆయన సన్నహితులు తెలిపారు. ఈ సంఘటనకు మూలకారణమైన పిఆర్ఓను మందలించాడు.

 Media boycotts Roy pressmeet in Hyderabad

‘రాయ్' సినిమా విషయానికొస్తే...
విక్రమ్ జిత్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో రణవీర్ కపూర్, అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భూషణ్ కుమార్, దివ్యా ఖోస్లా కుమార్, కృష్ణ కుమార్, ఫ్రీవే పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 13వ తేదీన ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రొమాంటిక్ థ్రిల్లర్ జేనర్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో అర్జున్ రాంపాల్ ఫిల్మ్ మేకర్ పాత్రలో నటిస్తున్నారు. రణబీర్ కపూర్ మిస్టీరియస్ దొంగ పాత్ర చేస్తున్నాడు. జాక్వెలియన్ ఫెర్పాండెజ్ రెండు విభిన్నమైన పాత్రల్లో డబల్ రోల్ చేస్తోంది. అర్జున్ రాంపాల్ తండ్రి పాత్రలో అనుపమ్ ఖేర్ నటిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X