సిధ్దార్ధపై ఫిలిం ఛాంబర్ లో కంప్లైంట్..దిల్ రాజుకి కాపి
హీరో సిద్దార్ధ ని తాజా చిత్రం సక్సెస్ మీట్ లో ఎలక్ట్రానిక్ మీడియా బహిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో పరిణామం చోటు చేసుకుంది. మీడియా గౌరవాన్ని వ్యక్తులుగా తమ వృత్తి గౌరవానికి ఆయన భంగం కలిగిస్తున్నారని మీడియా ప్రతినిదుల తరపున సంఘం ఉపాద్యక్షుడు లక్ష్మీనారాయణ తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఈ విషయమై సిద్దార మీద ఫిర్యాదు చేస్తూ ఎపి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం నిర్మాతల మండలికి కూడా ఫిర్యాదు చేశారు. దీనిని పరిశీలిస్తున్నామని నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ చెప్పారు. సిద్దార్ధ మీడియాకు క్షమాఫణలు చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెబుతున్నారు. కాగా ఈ ఫిర్యాదును సిద్దార్ధ తో సినిమా తీస్తున్న నిర్మాత దిల్ రాజుకు కూడా పంపించారు.


Click it and Unblock the Notifications











