ఇండైరక్ట్ గా మీడియానే మా పెళ్ళికి ...అల్లు అర్జున్
రీసెంట్ గా వివాహం చేసుకున్న అల్లు అర్జున్ తన పెళ్ళి గురించి మాట్లాడుతూ...మాది ఒక రకంగా లవ్ మ్యారేజి. నేను స్నేహను ఓ ప్యామిలీ ప్రెండ్ పెళ్ళిలో కలిసాను. ఆ తర్వాత ప్రెండ్స్ మి , కొద్దిరోజులుకు లవర్స్ ఇప్పుడు కపుల్స్ మి అయ్యాము అన్నారు. అలాగే చాలా మంది లాగే నేను కూడా మొదట నా ప్రేమను ఆమె వద్ద ఎక్సప్రెస్ చేసాను. మా పెద్దలను ఒప్పించాము. మీడియా కవరేజ్ కూడా ఇండైరక్ట్ గా నా వివాహానికి ఉపయోగపడింది.
ఇక నుంచి నేను సంవత్సరానికి రెండు లేదా మూడు సినిమాలు చేస్తాను. నా పూర్తి కాన్సర్టేషన్ అంతా నా పాత్రలు పై పెడతాను అన్నారు. ఇబ్రహీంపట్నంలో బిటెక్ చేసి అమెరికాలో ఎమ్మెస్ చేసిన స్నేహారెడ్డి తండ్రికి విద్యాసంస్థలు ఉన్నాయి. అల్లు ఆర్జున్ కు స్నేహారెడ్డితో గత సంవత్సర కాలంగా పరిచయం ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్..వివి వినాయిక్ కాంబినేషన్ లో బద్రీనాధ్ చిత్రం రూపొందుతోంది. ఆ తర్వాత అల్లు అర్జున్ ..త్రివిక్రమ్ కాంబినేషన్ లో చిత్రం ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











