మహేష్ ఖలేజా..మరో కొమరం పులి అవ్వాలని శాపనార్థాలు పెట్టిన మీడియా...

By Sindhu

ప్రిన్స్ మహేష్ బాబు తన 'ఖలేజా" చిత్రం ఆడియోను వినూత్నంగా ఆవిష్కరించాలనుకుని ఆ కార్య క్రమాన్ని హైదరాబాదులోని రేడియో మిర్చి స్టేషన్ లో ఏర్సాటు చేయించారు. ముందుగా 'మిర్చి" లోకి ప్రవేశించిన మహేష్,'మిర్చి" శ్రోతలతో పిచ్చాపాటిగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆయన వెంట దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఉన్నారు. ఇంతలో ఆడియో విడుదల కార్యక్రమంలోసం ఎలక్ట్రానిక్, ప్రింట్, వెబ్ సైట్ మీడియా ప్రతినిధులు మిర్చి ఆఫీసు వద్దకు చేరుకున్నారు. అయితే వీరిని కార్యాలయం సిబ్బంది లోనికి ప్రవేశించకుండా అడ్డుకున్నది. ఇంతలో చిత్ర నిర్మాత శింగనమల రమేష్ వచ్చారు. ఆయన లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆయనను సైతం అడ్డుకున్నారు. దీంతో కోపోద్రిక్తుడైన రమేష్ తన కారులో తిరిగి వెళ్లిపోయారు.

అయితే మీడియా ప్రతినిధులు మాత్రం ఆడియో విడుదల కార్యక్రమ వివరాలకోసం సుమారు గంటన్నరపాటు మిర్చి ఆఫీసు ముందే వేచి చూశారు. అయితే చివరికి ఏదో ఒకరిద్దరిని లోపలికి మహేష్ ఆహ్వానించారనీ, అయితే ఆ ఇద్దర్నీ చూసిన మహేష్ ఎవరూ రాలేదంటూ తిరిగి వెళ్ళిపోయారు. మీడియా ప్రతినిధులు ఆయనను కలవాలని ఎంత ప్రయత్నించినా మహేష్ వెళ్లిపోయాడు. దాంతో ఆగ్రహించిన మీడియా ప్రతినిధులు మహేష్ ఖలేజా..మరో కొమరం పులి అవుతుందని శాపనార్థాలు పెట్టారు. మహేష్ బాబు పట్టిపులేని ధోరణి వల్లే ఇదంతా జరిగిందని వారు విమర్శించారు. అయితే బయట ఏం జరిగిందో తనకు తెలియదని మహేష్ చెప్పగా, ఇదంతా కేవలం రేడియో మిర్చి అత్యుత్సాహం వల్లనే జరిగిందని మరికొందరు అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X