'సూర్య' ఫంక్షన్ లో షాకయిన స్టార్స్ !!

దాంతో ముఖ్య అతిధులుగా వచ్చిన వెంకటేష్,రామ్ చరణ్ తేజ,ప్రియమణి,సూర్య,సమీరారెడ్డి లను ఫొటోలు తీయటానికి ఎవరూ ముందుకు రాలేదు. కొద్ది సేపు పరిస్ధితి ఎవరికీ అర్ధం కాలేదు. ఫంక్షన్ ఫ్రారంభమైనా మీడియా వారిలో స్పందన లేదు.ఇంతలో గౌతమ్ మీనన్ స్టేజీ పై వచ్చి నిలబడినా ఎవరూ పట్టించుకోనట్లే ఊరుకున్నారు. దాంతో విషయం తెల్సుకున్న ఆయన వెంటనే ప్రెస్ వారికి క్షమాపణ చెప్పి నాకు కవరేజి ముఖ్యం దయచేసి ఫొటోలు తీయండని వేడుకున్నారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు.అప్పుడు ఐమాక్స్ వారిని పిలిపించి సారీ చెప్పించి ఒప్పించారు.
అప్పుడు కెమెరాలు క్లిక్ మన్నాయి. అందరి ముఖాల్లో ఆనందం వెల్లివెరిసింది. అంటే తాము వస్తే వెంటనే ఫ్లాష్ లు,ఆటో గ్రాఫ్ లు,ఇంటర్వూలు ప్రెస్ వారు వెనకపడి మరీ అడుగుతారని భావించిన వారు ఈ సంఘటన తో కొంత వరకూ విషయం అర్ధం చేసుకున్నారని,ప్రెస్ విలువ అర్ధం చేసుకున్నారని అంటున్నారు. ఇదే విషయాన్ని పురస్కరించుకుని ఫిల్మ్ నగర్ వాసులు ప్రెస్ ముఖ్యమా...స్టార్స్ ముఖ్యమా అన్న రీతిలో చర్చలు సాగిస్తున్నారు.దేని గొప్ప దానిదే కదా...ఇండిపెండెంట్ ఏదీ కాదు...


Click it and Unblock the Notifications











