twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్యూ రగడ : చిరును విలన్‌గా చిత్రీకరించారంటున్న తేజ!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: కేంద్రమంత్రి, కాంగ్రెస్ ప్రచార కమిటీ రథ సారథి చిరంజీవికి బుధవారం హైదరాబాద్‌లో ఓటు వేసే సమయంలో చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాని వెళ్లగా....క్యూలో నిలబడకుండా నేరుగా వెళ్లి ఓటు వేయడానికి ప్రయత్నించడంతో ఇతర ఓటర్లు అభ్యంతరం చెప్పారు. దీంతో ఆయన తిరిగి వెళ్లి మళ్లీ క్యూలో నిలబడక తప్పలేదు.

    దీనిపై చిరంజీవి స్పందిస్తూ....తాను నిబంధనల మేరకు వరుసలో నిలబడే ఓటు వేశానని చిరంజీవి చెప్పారు. తనకు ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉందన్నారు. తాను ఇన్నాళ్లు ఎన్నికల ప్రచారంలో ఉన్నందున.. ఓటర్ల జాబితాలో (లిస్ట్‌లో) తన పేరు ఉందా లేదా అని తెలుసుకునేందుకే వెళ్లానని, అంతే తప్ప నేరుగా ఓటేసేందుకు వెళ్లలేదన్నారు.

    Media tried to show Chiranjeevi as villain : Teja

    కాగా చిరంజీవి క్యూ రగడ జరిగిన సమయంలో అక్కడే ఉన్న దర్శకుడు తేజ అసలు విషయాన్ని బయట పెట్టారు. ఈ రోజు ఆయన ఓ అంతర్జాల పత్రికతో మాట్లాడుతూ.......'చిరంజీవి ఓటు వేసే సమయంలో నేను అదే పోలింగు బూతులో ఉన్నాను. చిరంజీవి తన ఫ్యామిలీతో వచ్చి ఓటు వేయడానికి క్యూలో నిలబడ్డారు. అక్కడే ఉన్న కొందరు మీడియా వారు ఆయన్ను నేరుగా వెళ్లి ఓటు వేయమని కోరారు. దీంతో చిరంజీవి నేరుగా ఓటు వేయడానికి వెళ్లారు. అదే సమయంలో ఒక వ్యక్తి చిరంజీవిని లైన్లో నిలబడి ఓటు వేయాలని ప్రశ్నించారు. చిరంజీవి ఆయనతో స్నేహ పూర్వకంగా మాట్లాడి మళ్లీ క్యూలైన్లో నిలబడ్డారు. కేవలం చిరంజీవిని కొందరు మీడియా వారు రిక్వెస్ట్ చేయడం వల్లనే ఆయన క్యూలో నుండి బయటకు వచ్చి నేరుగా వెళ్లి ఓటు వేయడానికి ప్రయత్నించారు. ఓ వ్యక్తి అభ్యంతరం తెలపడంతో మళ్లీ వచ్చి లైన్లో నిల్చున్నారు. ఈ సంఘటన మొత్తానికి మీడియా వారి నిర్వాకమే కారణం. వారి రిక్వెస్ట్ వల్లనే ఆయన వెళ్లారు. మళ్లీ వారే ఆయన్ను నిబంధనలు పాటించడం లేదంటూ విలన్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేసారు' అంటూ దర్శకుడు తేజ తెలిపారు.

    మరి దర్శకుడు తేజ చెబుతున్న మాట వాస్తవమే అనుకుందా....మరి చిరంజీవి నిన్న మీడియాకు వివరణ ఇస్తూ.....''ఓటర్ల జాబితాలో తన పేరు ఉందో? లేదో? అని తెలుసుకునేందుకే వెళ్లానని, అంతే తప్ప నేరుగా ఓటేసేందుకు వెళ్లలేదు'' అని ఎందుకు చెప్పిట్లు అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

    English summary
    "I was there at the same polling booth where Chiranjeevi has voted. The guy who obstructed Chiranjeevi was standing ahead in the same line. Chiranjeevi came to polling booth along with his family and stood in the queue. Chiranjeevi has gone ahead only because others requested him to do so and returned to queue after somebody objected to it. Media has shown the entire episode in magnifying glass and tried to show Chiranjeevi as villain" Director Teja said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X