twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజినీకాంత్ ఆరోగ్యంపై వైద్యుల రిపోర్ట్: ఆదివారం మధ్యాహ్నానికి నిర్ణయిస్తామని ప్రకటన

    |

    సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులకు శుభవార్త చెప్పారు అపోలో ఆస్పత్రి వైద్యులు. శుక్రవారం నుంచి హైబీపీతో బాధ పడుతోన్న ఆయన ప్రస్తుతం కోలుకున్నట్లు వాళ్లు వెల్లడించారు. ఈ మేరకు హెల్త్ బులిటెన్ రూపంలో ఓ ప్రకటనను విడుదల చేశారు. 'రజినీకాంత్‌కు మా వైద్యులు చేసిన పరీక్షల తాలుకు రిపోర్టుల అన్నీ వచ్చాయి. వాటిలో ఆందోళనకరమైన అంశాలు ఏమీ వెల్లడి కాలేదు. సో.. ఆయన ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయనను మా వైద్యులు పర్యవేక్షిస్తారు. ఆ తర్వాత డిశ్చార్జ్‌పై నిర్ణయం తీసుకుంటారు' అని అందులో పేర్కొన్నారు.

    ఈరోజు రజినీకాంత్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయితే.. వెంటనే ఆయనను చెన్నై తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు బేగంపేట విమానాశ్రయంలో ప్రత్యేక విమానాన్ని కూడా సిద్ధంగా ఉంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వెంట పెద్ద కుమార్తె తోడుగా ఉన్నారు. వైద్యుల సూచన మేరకు మిగిలిన కుటుంబ సభ్యులెవరూ ఆస్పత్రికి చేరుకోలేదు. మరోవైపు, తెలుగు, తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా రజినీకాంత్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం సమాచారం తెలుసుకుంటున్నారు.

    Medical Bulletin of Rajanikanth: this afternoon take a decision on his discharge

    ఇదిలా ఉండగా, కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతోన్న 'అన్నత్తై' షూటింగ్‌లో రజనీకాంత్ పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం చిత్ర యూనిట్‌లోని కొందరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో సినిమా షూటింగ్‌ను నిలిపివేశారు. అదే సమయంలో రజినీకాంత్ ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో స్వీయ నిర్భందంలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఆ వెంటనే ఆయనను సహాయక సిబ్బంది హైదరాబాద్‌లోని అపోలో ఆస్పతిత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయన హై బీపీతో బాధ పడుతున్నట్లు నిర్ధారించారు.

    English summary
    Megastar Rajinikanth was admitted to Apollo Hospital a day back on December 25, 2020, after his blood pressure shot up. The legendary star is currently under medical supervision and the hospital has released a fresh health bulletin. While his BP continues to remain high, it is under control.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X