Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
రజినీకాంత్ ఆరోగ్యంపై వైద్యుల రిపోర్ట్: ఆదివారం మధ్యాహ్నానికి నిర్ణయిస్తామని ప్రకటన
సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులకు శుభవార్త చెప్పారు అపోలో ఆస్పత్రి వైద్యులు. శుక్రవారం నుంచి హైబీపీతో బాధ పడుతోన్న ఆయన ప్రస్తుతం కోలుకున్నట్లు వాళ్లు వెల్లడించారు. ఈ మేరకు హెల్త్ బులిటెన్ రూపంలో ఓ ప్రకటనను విడుదల చేశారు. 'రజినీకాంత్‌కు మా వైద్యులు చేసిన పరీక్షల తాలుకు రిపోర్టుల అన్నీ వచ్చాయి. వాటిలో ఆందోళనకరమైన అంశాలు ఏమీ వెల్లడి కాలేదు. సో.. ఆయన ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయనను మా వైద్యులు పర్యవేక్షిస్తారు. ఆ తర్వాత డిశ్చార్జ్‌పై నిర్ణయం తీసుకుంటారు' అని అందులో పేర్కొన్నారు.
ఈరోజు రజినీకాంత్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయితే.. వెంటనే ఆయనను చెన్నై తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు బేగంపేట విమానాశ్రయంలో ప్రత్యేక విమానాన్ని కూడా సిద్ధంగా ఉంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వెంట పెద్ద కుమార్తె తోడుగా ఉన్నారు. వైద్యుల సూచన మేరకు మిగిలిన కుటుంబ సభ్యులెవరూ ఆస్పత్రికి చేరుకోలేదు. మరోవైపు, తెలుగు, తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా రజినీకాంత్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం సమాచారం తెలుసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా, కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతోన్న 'అన్నత్తై' షూటింగ్లో రజనీకాంత్ పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం చిత్ర యూనిట్‌లోని కొందరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో సినిమా షూటింగ్‌ను నిలిపివేశారు. అదే సమయంలో రజినీకాంత్ ఓ ఫైవ్ స్టార్ హోటల్లో స్వీయ నిర్భందంలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఆ వెంటనే ఆయనను సహాయక సిబ్బంది హైదరాబాద్‌లోని అపోలో ఆస్పతిత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయన హై బీపీతో బాధ పడుతున్నట్లు నిర్ధారించారు.