»   » రామ్ చరణ్ ఫ్యామిలీలో మెడికల్ ఎమర్జెన్సీ: ఫ్యాన్స్ కంగారు!

రామ్ చరణ్ ఫ్యామిలీలో మెడికల్ ఎమర్జెన్సీ: ఫ్యాన్స్ కంగారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అమెరికాలోని న్యూజెర్సీ లో అక్టోబర్ 15న జరిగే చారిటీ కార్యక్రమానికి హాజరై లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంది. అయితే రామ్ చరణ్ ఫ్యామిలీలో మెడికల్ ఎమర్జెన్సీ ఉండటంతో రామ్ చరణ్ అకస్మాత్తుగా తన యూఎస్ టూర్ రద్దు చేసుకున్నారు.

ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ...'హ్యూమానిటీ యూనైటెడ్ అగైనిస్ట్ టెర్రర్' చారిటీ ఈవెంటుకు హాజరు కాలేక పోతున్నాను. ఒక మంచి ఉద్దేశ్యంతో నిర్వమిస్తున్న ఈవెంటులో పెర్పార్మెన్స్ ఇవ్వడానికి ఎంతో ఆతృతగా ఎదరు చూసాను. కానీ ఫ్యామిలీలో మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ ఉండ‌డం వ‌ల‌న హాజ‌రు కాలేక‌పోతున్నాను. నిర్వహకులకు ఆల్ ది బెస్ట్ అంటూ ఆయన ఎఫ్‌బిలో పోస్టు చేసారు.

 Ram Charan

అయితే రామ్ చరణ్ పోస్టుతో అభిమానులు కంగారు పడుతున్నారు. మెగా ఫ్యామిలీలో మెడికల్ ఎమర్జెన్సీ ఎవరికి? చెర్కీ తన అమెరికా టూర్ రద్దుచేసుకునేంతగా ఎవరు అనారోగ్యం పాలయ్యారు? అనే విషయపై క్లారిటీ లేక అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

కాశ్మీరీ పండిట్లపై జరిగిన ఉగ్రవాద దాడుల్లో నష్టపోయినవారిని ఆదుకోవడానికి ఈ చారిటీ కార్యక్రమం ఏర్పాటుచేసారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఈనెల 15న జరుగబోయే ఈవెంట్ లో సినీతారలు పాల్గొని పర్ఫార్మెన్స్ లు చేయనున్నారు. ఈ ఈవెంట్ లో అఖిల్, శ్రీయ, ప్రభుదేవా, మలైకా అరోరా, సోఫీ చౌదరిలు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోనాల్డ్ ట్రంప్ హాజరుకాకున్నారు.

English summary
"I am very thankful to be invited for the charity event "Humanity United Against Terror". I was eagerly looking forward to my performance as it is for such a great cause. But I am deeply disheartened for not being able to make it to an event of such generosity due to a last moment medical emergency in my family. I'm surely going to make it up for my fans, who would be disappointed about this and I wish RHC all the best for initiating such a noble initiative. Good Luck!" Ram Charan said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu