క్రాక్ డైరెక్టర్‌తో ఇంటర్వ్యూ అన్న తరుణ్ భాస్కర్.. యాక్టింగ్ భరించలేమంటూ కామెంట్

మీకు మాత్రమే చెప్తాతో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న తరుణ్ భాస్కర్.. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఫన్నీ వీడియోను విడుదల చేశాడు. తనలో ఉన్న దర్శకుడు, నటుడు ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. డిఫరెంట్‌గా ప్లాన్ చేసిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. విజయ్ దేవరకొండ నిర్మాణంలో వస్తోన్న ఈ మూవీని నవంబర్ 1న విడుదల చేసేందుకు రంగం సిద్దమైంది. నిన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించిన సంగతి తెలిసిందే.

మూవీ విడుదలయ్యేందుకు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉండటం ప్రమోషన్స్ పెంచింది చిత్రయూనిట్. ఈ క్రమంలో తరుణ్ భాస్కర్ తనతో తాను చేసిన ఇంటర్వ్యూ అందర్నీ ఆకట్టుకుంటోంది. తనపై తానే కుళ్లు జోకులు వేసుకుంటూ, సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. యాక్టర్ రూపంలో ఉన్న తరుణ్ భాస్కర్ మొదటగా వచ్చి కాస్త యాటిట్యూడ్‌ను ప్రదర్శించాడు. ఓ క్రాక్ దర్శకుడికి ఇంటర్వ్యూ ఇవ్వబోతోన్నట్లు తెలిపాడు.

Meeku Matrame Cheptha Movie promotions Tharun Bhascker Interview

దర్శకత్వం చేసేటప్పుడు డైరెక్షన్ మాత్రమే చేస్తానని, నటించేటప్పుడు కేవలం యాక్టింగ్‌పైనే దృష్టి పెడతాననే విషయాన్ని తెలిసేలా చేశాడు. ఫలక్‌నుమాదాస్ చిత్రంలో ఏం యాక్టింగ్‌రా భరించలేమంటూ తనపై తానే కౌంటర్ వేసుకున్నాడు. మళ్లీ భవిష్యత్తులో కూడా నటిస్తానని, దర్శకత్వం కూడా చేస్తానని స్ఫష్టం చేశాడు. అయితే తనకు తన సినిమాలో స్పెషల్ అప్పీయరెన్స్‌లా మాత్రం కనిపించనని చేస్తే ఏదో ఒక్కటి మాత్రమే చేస్తానని చెప్పాడు. తనలోని దర్శకుడు మీకు మాత్రమే చెప్తా సినిమాలో కలగజేసుకోలేదని తరుణ్ చెప్పకనే చెప్పాడు. ఇక ఈ వీడియోలో తరుణ్ భాస్కర్ చేసిన కామెడీతో హైలెట్‌గా నిలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X