»   » మెగా ఫ్యామిలీకి బరువే, చిరు వల్ల పోగొట్టుకుంది రాబట్టుకున్న హీరో నాని!

మెగా ఫ్యామిలీకి బరువే, చిరు వల్ల పోగొట్టుకుంది రాబట్టుకున్న హీరో నాని!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి హోస్ట్‌గా ప్రసారం అవుతున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ 4' ఏప్రిల్ 9న జరిగిన ఎపిసోడ్ హీరో నాని రాకతో మరింత సందడి సాగింది. మెగాస్టార్ చిరంజీవి, నాని మధ్య జరిగిన సంబాషణలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.... ఒకప్పుడు చిరంజీవి సినిమా మూలంగా తాను పోగొట్టుకున్న ఓ వస్తువును నాని ఈ గేమ్ షోద్వారా స్వయంగా చిరంజీవి ద్వారా రాబట్టుకున్నారు. అందుకు సంబంధించిన విషయాలపై ఓ లుక్కేద్దాం..

సార్ మీరు నన్ను మీరు అని పిలవొద్దు

సార్ మీరు నన్ను మీరు అని పిలవొద్దు

చిరంజీవి హీరో నానిని మీరు అని సంబంబోధిస్తుండటంతో....సార్ మీరు నన్ను మీరు అనొద్దు. నాని అని పిలవండి, మీ సినిమాలు చూసి పెరిగాం. 20 సినిమాలు చేసిన తర్వాత ఫస్ట్ టైం చెమటలు పడుతున్నాయి. ఎప్పుడూ ఇంత నెర్వస్ ఫీలవ్వలేదు. మీ సినిమాల కోసం టికెట్లలో నిలబడి పోలీసుల చేతిలో దెబ్బలు కూడా తిన్నాం అని నాని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

నానిలో నన్ను నేను చూసుకున్నట్లుంది

నానిలో నన్ను నేను చూసుకున్నట్లుంది

చిరంజీవి మాట్లాడుతూ...వెనకా ముందు ఎవరూ లేకుండా ఒక గట్ ఫీలింగుతో, మన టాలెంటు మీద నమ్మకంతో ఎవరైనా సరే ఈ ఇండస్ట్రీలోకి వచ్చి వాళ్లు కష్టపడి ప్రూవ్ చేసుకుని, ఆడియన్స్ మన్ననలు పొందుతూ, వారి అభిమానాన్ని చూరగొంటూ ఇలా నిలబడటం అంటే వారికి దోసోహం అని అర్థం. నేనూ అలా వచ్చిన వాన్నే... ఆ నమ్మకంతో వచ్చిన వాన్నే... ఈ రోజు మిమ్మల్ని చూస్తుంటే నానిలో నన్ను నేను చూసుకుంటున్నట్లుంది. హానెస్ట్ గా చెబుతున్నాను... అని చిరంజీవి అన్నారు.

మెగా ఫ్యామిలీకి మీరు బ్యాగ్రౌండ్ కాదు... బరువు

మెగా ఫ్యామిలీకి మీరు బ్యాగ్రౌండ్ కాదు... బరువు

నాని మాట్లాడుతూ....మీరు ఏమీ అనుకోనంటే.. ఇదే సందర్భంలో మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇండస్ట్రీలో అందరూ అనుకుంటూ ఉంటారు... చరణ్ కి, బన్నీకి, సాయికి, వరుణ్ కి చిరంజీవిగారు బ్యాగ్రౌండ్ అనుకుంటారు. వీరందరికీ చిరంజీవిగారు బ్యాగ్రౌండ్ కాదు. నిజంగా చెప్పాలంటే ఒక బరువు. రెస్పాన్సబిలిటీ, మీరొకరకంగా స్ట్రెస్.... నా లాంటి ఏ బ్యాగ్రౌండ్ లేని ప్రతి వాడికి మీరు బ్యాగ్రౌండ్ అని నాని తెలిపారు.... దీనికి చిరంజీవి స్పందిస్తూ మీరు చాలా బాగా చెప్పారు. ఇంట్లో వాళ్లందరికీ నా ఇమేజ్ వల్ల మానసిక ఒత్తిడి అది నిజమే అన్నారు.

తన కెరీర్ గురించి నాని

తన కెరీర్ గురించి నాని

సినిమా అంటే పిచ్చి. ఏం చేయాలో తెలియదు. హీరో అయ్యే పర్సనాలిటీగానీ, కలర్ కానీ నాకు లేదు. అందుకే ఏదో ఒకటి నేర్చుకుందామని అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాను. తొలి సినిమా బాపు గారి దగ్గర రాధా గోపాళం, తర్వాత రాఘవేంద్రరావు దగ్గర, మూడోది శ్రీను వైట్ల దగ్గర చేసాను... అని నాని తెలిపారు.

అలా తొలి అవకాశం

అలా తొలి అవకాశం

అసిస్టెంట్ డైరెక్టర్ గానే ఉండి పోకుండా... నేను కూడా స్క్రిప్టు డెవలప్ చేయాలని కాన్సట్రేట్ చేయడం మొదలు పెట్టి పాకెట్ మనీ కోసం ఆర్ జె గా జాయిన్ అయ్యాను. అక్కడ నా ఫ్రెండ్ ఒక యాడ్ ఫిల్మ్ లాంటిది షూట్ చేస్తూ ఐడియా అడిగితే.... ఐడియా చెబుతూనే డైలాగులు వారికి అర్థం అవ్వడం కోసం చెప్పి వినిపించాను. తర్వాత నాతోనే ఆ యాడ్ ఫిల్మ్ చేయించారు. దాని ఎడిటింగ్, అష్టా చమ్మ స్క్రిప్టు డిస్ర్కషన్స్ ఒకే ఆఫీసులో జరిగాయి. అపుడు మోహన్ కృష్ణ గారు రావడం, అపుడు ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఎడిట్ రూమ్ లో కూర్చోవడం, అక్కడ నేను చేసిన యాడ్ ఫిల్మ్ ఎడిటింగ్ జరుగడం, ఆయన చూసి ఈ సినిమాకు నేనైతే బావుంటాను అని సెకండ్ క్యారెక్టర్ కోసం తీసుకొచ్చారు. తర్వాత నా అదృష్టం బావుండి నన్నే మెయిన్ క్యారెక్టర్ చేయడం జరిగింది అని నాని తెలిపారు.

నేను కూడా అంతే అంటూ చిరంజీవి

నేను కూడా అంతే అంటూ చిరంజీవి

నేను సినిమాల్లోకి రాక ముందు నా ఆలోచన కూడా నీలాగే ఉండేది. ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేరితే ఎవరైనా అవకాశం ఇస్తారని ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ మద్రాస్ లో చేరాను. అక్కడే రజనీకాంత్, రాజేంద్రప్రసాద్ వీరంతా నాకు సీనియర్స్ గా అక్కడ ట్రైనింగ్ అయిన వారే. నీలో నేను చూసుకుంటున్నాను అనడానికి కారణం... అప్పట్లో నా ఆలోచన విధానం కూడా నీలాగే ఉండేది అని చిరంజీవి అన్నారు.

మీ వల్లే నా సైకిల్ పోయింది, మీరే కొనివ్వాలి

మీ వల్లే నా సైకిల్ పోయింది, మీరే కొనివ్వాలి

ఇంట్లో గోల చేస్తే ఎంటీబీ సైకిల్ కొనిచ్చారు. అదే సమయంలో మాస్టర్ సినిమా రిలీజైంది. సత్యం థియేటర్లో టికెట్ కోసం వచ్చి క్రౌడ్ లో టికెట్ సంపాదించాను కానీ... సైకిల్ పోగొట్టుకున్నాను. అపుడు టికెట్ దొరికిన ఆనందం ముందు సైకిల్ పోవడం బాధ అనిపించలేదు. సినిమా అయిపోతుంటే బాధ మొదలైంది. ఆ రోజే అనుకున్నా ఏదో ఒక రోజు అవకాశం వస్తే మిమ్మల్ని సైకిల్ అడుగుదామని....భలే భలే మగాడివోయ్ సినిమా ఆడియో రిలీజ్ వేడుకలో అరవిద్ గారిని అడిగాను....ఇప్పటి వరకు నాకు సైకిల్ తిరిగి రాలేదు. ఇపుడు డైరెక్టుగా మిమ్మల్ని అడుగుతున్నాను.... అని నాని అన్నారు.

కొనిస్తానని మాట ఇచ్చిన చిరంజీవి

కొనిస్తానని మాట ఇచ్చిన చిరంజీవి

దీనికి వెంటనే చిరంజీవి స్పందిస్తూ... నేను మీ సైకిల్ కొనిస్తాను. ఆ బాధ్యత నాది. సెట్టు సమక్షంలో చెబుతున్నాను. మాస్టర్ సమయంలో పొగొట్టుకున్న మీరు పోగొట్టుకున్న ఎంటీబీ సైకిల్ ఇస్తాను. ఇంతకంటే ఆనందం నాకు ఏముంటుంది.

నటిస్తానని మాట ఇచ్చిన చిరంజీవి

నటిస్తానని మాట ఇచ్చిన చిరంజీవి

ఎప్పటికైనా మీరు నా సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ చేయాలని ఉంది. నేను చంటబ్బాయి చేస్తే మీరు చిన్న గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వండి చాలు అని నాని అడిగారు. దీనికి వెంటనే చిరంజీవి ఓకే చెపపారు.

ఆ డబ్బు అమల్ అనే కుర్రాడి కోసం

ఆ డబ్బు అమల్ అనే కుర్రాడి కోసం

ఈ షోలో నాని రూ. 6.40 లక్షలు గెలుచుకున్నారు. షోలో గెలిచిన డబ్బును బోన్ మ్యారో డిసీజ్ వచ్చిన అమల్ అనే ఒక కుర్రాడికి డొనేట్ చేయనున్నట్లు నాని తెలిపారు.

ఫోటో సైజన్యం: హాట్‌స్టార్

English summary
Tollywood Actor Nani wins Rs. 6.40 lakhs in Meelo Evaru Koteeswarudu season 4, which is hosted by Megastar Chiranjeevi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu