Don't Miss!
- Sports సూపర్‌మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్‌తో ఢిల్లీని గెలిపించాడు! Video
- News భట్టికి షాక్ - పంతం నెగ్గించుకున్న పొంగులేటి..!!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కరెన్సీ సమస్యే మాకూ వచ్చింది
పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ మీలో ఎవరు కోటీశ్వరుడు. ఈ చిత్రాన్ని అ
ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ.. పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా ఇ.సత్తిబాబు ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈనెలలోనే చిత్రాన్ని రిలీజ్ చెయ్యాల్సి వుండగా, ప్రస్తుతం అందరూ ఎదుర్కొంటున్న కరెన్సీ సమస్యను దృష్టిలో వుంచుకొని డిసెంబర్ 23న ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలని నిర్ణయించాం.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ట్రైలర్స్ అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తప్పకుండా మా బేనర్లో ఈ సినిమా మరో సూపర్‌హిట్ సినిమా అవుతుంది అన్నారు. ఒక కంపెనీకి లాస్ వచ్చేలా మంచి ఐడియా ఇస్తే కోటి రూపాయలిస్తామంటూ పేపర్లో ఓ ప్రకటన వస్తుంది. దీని చుట్టూ అల్లిన స్టోరీనే 'మీలో ఎవరు కోటీశ్వరుడు'.
నవీన్‌చంద్ర, శృతి సోధి, పృథ్వీ, సలోని, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, రఘుబాబు, ప్రభాస్ శ్రీను, చలపతిరావు, ధన్‌రాజ్, పిల్లా ప్రసాద్, గిరి, సన, విద్యుల్లేఖా రామన్, మీనా, నేహాంత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీవసంత్, సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి పి., కథ, మాటలు: నాగేంద్రకుమార్ వేపూరి, కథా విస్తరణ: విక్రవమ్‌రాజ్, డైలాగ్స్ డెవలప్మెంట్: క్రాంతిరెడ్డి సకినాల, పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, ఎడిటింగ్: గౌతమ్‌రాజు, ఆర్ట్: కిరణ్‌కుమార్, ఫైట్స్: రియల్ సతీష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.ఎస్.కుమార్, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్, నిర్మాత: కె.కె.రాధామోహన్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఇ.సత్తిబాబు.