నాడు రజినీకి కుమార్తె, ప్రేయసిగా.. నేడు విలన్‌గానూ.. వైరల్ న్యూస్

సూపర్ స్టార్ రజినీ కాంత్ యంగ్ హీరోలతో పోటీ పడుతూ.. జెట్ స్పీడ్‌లో సినిమాలు పూర్తి చేసేస్తున్నాడు. ఆరు పదుల వయసు దాటుతున్నా.. ఏ మాత్రం విశ్రాంతి తీసుకోకుండా చకచకా ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ పూర్తి అయిన వెంటనే శివ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్‌ను రెడీ చేశాడు.

ముంబై బ్యాక్ డ్రాప్‌లో..

ముంబై బ్యాక్ డ్రాప్‌లో..

విలక్షణ దర్శకుడు ఏఆర్ మురుగదాస్.. సూపర్ స్టార్ రజినీకాంత్‌తో మొదటిసారి సినిమాను తెరకెక్కించడంతో అంచనాలు ఆకాశన్నంటాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, పాటతో భారీ హైప్ క్రియేట్ చేసిన చిత్రబృందం ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్దమైన ఈ మూవీలో నయనతార, నివేదా థామస్ లాంటి వారు ప్రముఖ పాత్రలను పోషిస్తున్నారు.

Recommended Video

#CineBox : RGV's #KRKR In Trouble? | Pawan Kalyan Voice Over For #AlaVaikunthapuramuloTeaser ?
 శివ దర్శకత్వంలో కొత్త సినిమా..

శివ దర్శకత్వంలో కొత్త సినిమా..

తమిళ నాట అజిత్-శివ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరం, వేదాలం, వివేగం, విశ్వాసం లాంటి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను తెరకెక్కించిన శివ.. సూపర్ స్టార్ కోసం అదిరిపోయే ఓ కథను సిద్దం చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే పట్టాలెక్కబోతోన్న ఈ మూవీకి సంబంధించి ఓ న్యూస్ బయటకు వచ్చేసింది.

 కూతురు, ప్రేయసిగా నటించిన మీనా..

కూతురు, ప్రేయసిగా నటించిన మీనా..

ఒకప్పటి అందాల నటి మీనా.. బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రజనీ హీరోగా నటించిన అన్బుల్ల కేట్ట కురల్ చిత్రంలో ఆయనకు కుమార్తెగా మీనా నటించింది. ఆపై ముత్తు, వీరా, యజమాన్ సినిమాల్లో ప్రేయసిగానూ జతకట్టిన సంగతి తెలిసిందే.

 తాజాగా విలన్‌గా అంటూ..

తాజాగా విలన్‌గా అంటూ..

ఇక ఇప్పుడు రజనీని ఎదురించే ప్రతి నాయకురాలిగానూ నటించనున్నట్లు ఓ టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అసలే సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తోన్న మీనా.. నటనకు ప్రాధాన్యమున్న వాటికే ఓకే చెబుతోంది. మరి ఈ చిత్రంలో మీనా క్యారెక్టర్ ఎలా ఉండబోతోందో చూడాలి. రజనీ సరసన కుష్బూ నటించబోతోన్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి వీటిపై చిత్రబృందం అధికారికంగా ప్రకటించే వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X