మీనా కొత్త చిత్రం విశేషాలు
ఈ సందర్భంగా నిర్మాత దొరస్వామి రాజు మాట్లాడుతూ..ఈ నెల 22న ఈ చిత్రం ఈ చిత్రం ఆడియోను ఆదిత్యా మ్యూజిక్ ద్వారా హైదరాబాద్ లో సినీ ప్రముఖులు, ఆర్యవైశ్య ప్రముఖుల సమక్షంలో విడుదల చేయనున్నామని చెప్పారు. మే 1న వాసవిదేవి జయంతిని పురస్కరించుకుని, చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ, ఈ మధ్యనే వాసవీదేవి అగ్ని ప్రవేశం చేసే సన్నివేశాలను, క్లైమాక్స్ దృశ్యాలను భారీ ఎత్తున చిత్రీకరించడంతో షూటింగ్ పార్ట్ పూర్తయిందని అన్నారు. ఆది పరాశక్తి, సరస్వతి, పార్వతి, వైష్ణవి, గాయత్రి, కృష్ణ వంటి పాత్రలను మీనాపై చిత్రీకరించడం జరిగిందని ఆయన వివరించారు.
శ్రీ వాసవి మంగళ హారతిని, వాసవి విశ్వ రూప సందర్శనాన్ని గ్రాఫిక్స్ ద్వారా అద్భుతంగా తెరకెక్కించామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో భాగంగా గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. దర్శకుడు ఉదయ భాస్కర్ మాట్లాడుతూ, అర్జునశర్మ సంగీత సారథ్యంలో రూపొందిన ఎనిమిది పాటలు, నాలుగు పద్యాలు ఎంతగానో అలరింప చేస్తాయని చెప్పారు.
ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రల్లో సుహాసిని, ప్రియా హాసన్, సుమన్, సాయి కిరణ్, కన్నడ ఎధర్, రఘునాథరెడ్డి, అశోక్ కుమార్, అనంత్, గుండు, కవిత, సన తదితరులు తారాగాణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రామాన్ జీ, ఎడిటింగ్: శ్రీనివాస్, రచనా సహకారం: జె.కె. భారవి, కథ, మాటలు, చిత్రానువాదం, దర్శకత్వం: ఉదయభాస్కర్.


Click it and Unblock the Notifications












