రామ్ చరణ్ అత్తగా ఆ మాజీ హీరోయిన్
చిరంజీవితో ముఠా మేస్త్రి వంటి చిత్రాలు చేసిన మీనా ను మర్చిపోవంటం కష్టం. ఇప్పుడు ఆమె రామ్ చరణ్ కి అత్తగా నటించబోతోందని తెలుస్తోంది. సమంత కి తల్లిగా చేయటానికి ఆమెను కలిసి ఒప్పించినట్లు ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. మొదట్లో మీనా రిజక్టు చేసినా తర్వాత ఆ క్యారెక్టర్, అందుకు ఆఫర్ చేసిన రెమ్యునేషన్ విని ఆమె ఓకే చేసినట్లు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని వివి వినాయిక్ డైరక్ట్ చేయనున్నాడని చెప్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ రచ్చ షూటింగ్ లోఉన్నారు. ఈ షూటింగ్ అనంతరం ఈ చిత్రం తెరకెక్కుతుంది. బద్రీనాధ్ ప్లాపుతో దిగులుగా ఉన్న వినాయిక్ ఈ చిత్రాన్ని పక్కా మాస్ ఎంటర్టైనర్ గా మార్చి హిట్ కొట్టాలని కసిగా స్క్ర్రిప్టు చేసుకుని రంగంలోకి దిగుతున్నారు. ఈ చిత్రంలో అత్త, అల్లుళ్ల మధ్య కొంత కథ జరుగుతుందని అందుకే కాస్త అలవాటు పడ్డ ఫేస్ అయితే క్రేజ్ వస్తుందని భావించి ఆమెను ఎంపిక చేసారని చెప్తున్నారు. ఇక మీనా విషయానికి వస్తే ఆమె బెంగుళూరుకి చెందిన ఓ సాప్ట్ వేర్ ఇంజినీర్ ని వివాహం చేసుకుని గృహిణిగా సెటిలైంది.


Click it and Unblock the Notifications











