తల్లి అయిన మాజీ హీరోయిన్ మీనా
చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రముఖ సినీ నటి మీనా శనివారం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషలకు చెందిన పలు సినిమాల్లో మీనా నటించారు. 2009లో మీనా వివాహం తిరుపతిలోని స్థానిక ఆర్వవైశ్యసమాజంలో ఘనంగా జరిగింది.ఆమె భర్త బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విద్యాసాగర్. పెళ్లి తరువాత చాలాకాలం మీనా ఇంటికే పరిమితం అయ్యారు. ప్రస్తుతం టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నారు. మీనా నటించిన చివరి తెలుగు సినిమా వెంగమాంబ. సీతారామయ్యగారి మనమరాలు నిర్మించిన దొరస్వామి రాజు ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేసారు.


Click it and Unblock the Notifications