రామ్ చరణ్ సినిమాలో నేను నటించటం లేదు ..అవన్నీ రూమర్స్
రామ్ చరణ్ తేజ్ హీరోగా చేయనున్న చిత్రం లో అత్తగా ఒకనాటి అందాల తార మీనా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై మీడియా వారు ఆమె వద్ద ప్రస్దావిస్తే దానికి ఆమె అవన్నీ బెస్ లెస్ రూమర్స్ అని కొట్టిపారేసింది. ఆమె మాట్లాడుతూ..ఈ వార్తను చదివి షాక్ అయ్యాను. ప్రస్తుతం సంసార జీవితంలో హ్యాపీగా ఉన్నాను. ఐదు నెలల తన గారాల పాప నైనికతో హాయిగా ఉన్నానని చెప్పింది.అలాగే తన అవసరం పాపకు చాలా ఉందని తెలిపింది. అందువల్ల ప్రస్తుతానికి నటించే ఆలోచన లేదని స్పష్టం చేసింది. మళ్లీ నటించాలనే ఆలోచన వచ్చినప్పుడు తానే స్వయంగా ప్రకటిస్తానని మీనా చెప్పుకొచ్చింది. ఇక రామ్ చరణ్ హీరోగా చేయబోయే ఆ చిత్రాన్ని వివి వినాయిక్ డైరక్ట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











