Don't Miss!
- News
తెలంగాణా బడ్జెట్ సమావేశాలు: గవర్నర్ ప్రసంగంపై అందరిలోనూ ఉత్కంఠ!!
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- Finance
WhatsApp: వామ్మో, అన్ని భారతీయ ఖాతాలను వాట్సప్ నిషేధించిందా..?
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Meena Husband Vidyasagar: మీనా భర్త మృతికి ఆ పక్షులే కారణం.. హైదరాబాద్‌లోనూ డేంజర్ బెల్స్
సినీ పరిశ్రమలో వరుసగా విషాదకర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది నటీనటులు, టెక్నీషియన్లు, సినీ రంగంతో సంబంధం ఉన్న చాలా మంది ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో చాలా మంది నటీనటుల కుటుంబ సభ్యులు కూడా కన్నుమూశారు. ఈ క్రమంలోనే దక్షిణాదిలో తనదైన చిత్రాలతో సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించిన సీనియర్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ మరణించారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతోన్న ఆయన మంగళవారం ప్రముఖ ఆస్పత్రిలో తుదిశ్వాసను విడిచారు. ఈ నేపథ్యంలో విద్యాసాగర్ మరణానికి కారణం ఏంటి అనే దానిపై ఓ ప్రత్యేక కథనాన్ని చూద్దాం పదండి!

మీనా భర్త విద్యాసాగర్ కన్నుమూత
సుదీర్ఘ కాలంగా దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన మీనా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కొంత కాలంగా శ్యాసకోస సంబంధిత సమస్యలతో బాధ పడుతోన్న ఆమె భర్త విద్యాసాగర్ మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆయన మరణ వార్తతో సినీ కుటుంబం షాక్‌కు గురైంది. ఆయన మృతిపై చాలా మంది ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
బాత్‌టబ్‌లో నగ్నంగా అషు రెడ్డి: స్నానం చేస్తున్న పిక్‌లతో రచ్చ.. ఇలా తెగించిందేంటి!

విద్యాసాగర్‌కు శ్వాసకోస సమస్యలు
మీనా భర్త మరణానికి కారణం ఆయన కొంత కాలంగా శ్వాసకోస (ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్) సమస్యతో బాధపడుతుండడమే అని తెలిసింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యాసాగర్ చాలా కాలంగా ఊపిరితిత్తుల సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే గత జనవరిలో కరోనా బారిన పడ్డారు. అప్పటి నుంచి సమస్య ఎక్కువైంది. ఇది విషమించే ప్రాణాలు కోల్పోయారట.

ఊపరితిత్తులు మార్చే ప్రయత్నం
కోవిడ్ బారిన పడిన తర్వాత విద్యాసాగర్ ఊపిరితిత్తుల్లో సమస్య మరింత ఎక్కువైంది. దీంతో వాటిని మార్చేందుకు ప్రయత్నాలు కూడా చేశారు. అయితే, బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ల నుంచే ఊపిరితిత్తులు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ, విద్యాసాగర్ కంటే ముందే చాలా మంది రిజిస్టర్ అయి ఉన్నారు. దీంతో ఆయనకు లంగ్స్ మార్చాలన్న ప్రయత్నాలు విఫలం అయ్యాయి.
Ram Marriage: ప్రియురాలితో హీరో రామ్ పెళ్లి.. నిశ్చితార్థం, వివాహం అప్పుడే.. అమ్మాయి ఎవరంటే!

విద్యాసాగర్ మృతికి పక్షులే కారణం
విద్యాసాగర్
ఊపిరితిత్తులకు
ఇన్ఫెక్షన్
రావడానికి
కారణం
పాపురాలే
అని
ఓ
న్యూస్
వైరల్
అవుతోంది.
ఈ
పక్షులు
జనాల
మధ్యలోనే
ఉంటాయి.
అయితే,
ఇవి
విసర్జించే
మల,
మూత్రాల
వల్ల
సూక్షజీవులు
పెరుగుతాయట.
అవి
గాల్లో
కలుస్తాయి.
ఆ
గాలిని
పీల్చుకోవడం
వల్లనే
విద్యాసాగర్
ఊపిరితిత్తుల
సమస్యకు
గురయ్యారట.
దీనిని
నిర్లక్ష్యం
చేయడం
వల్ల
ప్రాణాలే
కోల్పోయారట.

పావురాల వల్ల ప్రమాదం ఏంటి?
పావురాలకు ప్రత్యేకంగా మూత్రకోశం అనేది ఉండదు. దీంతో విసర్జనలోనే మల, మూత్రాలు ఉంటాయి. వీటి రెట్టల నుంచి ఇన్‌ఫెక్షన్ కారక సూక్ష్మక్రిములు గాల్లో కలిసిపోతాయి. అవి తక్కువగా ఉన్నప్పుడు పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ, ఈ బాక్టీరియా మోతాదు ఎక్కువైతే మాత్రం శ్వాసకోస సమస్యలు.. ముఖ్యంగా దగ్గు, జలుబు వంటివి వచ్చి ప్రమాదకరంగా మారిపోతాయట.
రష్మిక మందన్నా అందాల ఆరబోత: ఇంతకు ముందెన్నడూ చూడనంత హాట్‌గా!

హైదరాబాద్‌లోనూ డేంజర్ బెల్స్
హైదరాబాద్ జంటనగరాల్లో ఎక్కడబడితే అక్కడ పావురాలు కనిపిస్తుంటాయి. దీంతో చాలా మంది ముచ్చటపడి వాటి దగ్గరకు వెళ్తుంటారు. అలా పావురాల గుంపు దగ్గరకు వెళ్లడం ఒకరకంగా ప్రమాదకరమైన పరిస్థితే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పక్షుల మలాన్ని పీల్చడం వల్ల సంక్రమించే సమస్య జలుబు, జ్వరంతో మొదలై.. ప్రాణాంతకంగా మారుతుందంటున్నారు.