తిరుమల : సినీ నటి మీనా వివాహం తిరుపతిలో ఘనంగా జరిగింది. స్థానిక ఆర్వవైశ్యసమాజంలో జరిగిన ఈ వివాహాన్ని కవరేజ్ చేసేందుకు వెళ్లిన మీడియా పై మీనా ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది జులుం ప్రదర్శించారు. ఈఘటనలో ఒక పాత్రికేయడి వేలును సెక్యూరిటీ సిబ్బంది కొరికారు. ఒక కెమెరాను ధ్వంసం చేశారు.ఇది కొంత అలజడి సృష్టించింది. ఇక ఈ వివాహానికి సినీరంగానికి చెందిన ప్రముఖులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విద్యాసాగర్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం కొత్త దంపతులు వెంకన్నను దర్శంచుకున్నారు.