twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అతనే మీనా మొగుడు

    By Staff
    |

    Meena
    నటి మీనా పెళ్లి చేసుకోనున్నారు. బెంగళూరుకు చెందిన ఓ కంప్యూటర్‌ ఇంజినీర్‌ను ఆమె జూలై 12వ తేదీన వివాహం చేసుకోనున్నట్టు కోలీవుడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. మీనా సీనియర్‌ నటి రాజమల్లిక, దురైరాజ్‌ దంపతుల కుమార్తె. బాల నటిగా పలు భాషా చిత్రాల్లో నటించిన మీనా దక్షిణాదిన అగ్రహీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆమె తెలుగులో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించింది. కొన్నేళ్లుగా సినిమా అవకాశాలు తగ్గడంతో టీవీ సీరియళ్లలో నటిస్తున్నారు.

    మీనా, బెంగళూరుకు చెందిన విద్యాసాగర్‌ల వివాహ నిశ్చితార్థం ఇటీవల జరిగినట్టు చెన్నై సినిమా వర్గాలు చెబుతున్నాయి. రెండు కుటుంబాల వారు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరైనట్టు సమాచారం. జూలై 12న వివాహం జరిపించాలని నిశ్చయించినట్టు మీనా సన్నిహితులు పేర్కొన్నారు. ఈ విషయంపై మీనా తల్లి రాజమల్లికను ప్రశ్నించగా ఆ విషయం మీనానే అడగండని వ్యాఖ్యానించడం గమనార్హం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X