twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రీ ఎంట్రీ : స్టార్ హీరోకి తల్లిగా మీనా

    By Srikanya
    |

    Meena
    హైదరాబాద్ : స్టార్‌ హీరోయిన్‌గా అలరించి ఆపై వైవాహిక జీవితంలో స్థిరపడి వెండితెరకు దూరమయ్యారు మీనా. మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వటానికి ఆమె ఈ సారి తల్లి పాత్రకైనా సిద్దమంటోంది. తాజాగా ఆమె మళయాళ స్టార్ హీరో ముమ్మట్టి తల్లిగా చేయటానికి అంగీకరించారని సమాచారం. నిజానికి మీనా వయసు నలభై లోపే. మమ్ముట్టికి అరవయ్యేళ్లు దాటి ఓ ఏడాది అయ్యింది. అయినా తనకన్నా వయసులో చాలా పెద్దవాడైన మమ్ముట్టికి తల్లిగా నటించడానికి మీనా అంగీకరించారని సమాచారం.

    వయసుకు తగ్గ పాత్రలు చేయడం సులువు కానీ ఇలా వయసుకు మించిన పాత్రలు మోయడం బరువే అంటున్నారు. దాంతో ఈ పాత్రను మీనా ఓ సవాల్‌గా తీసుకున్నానని అంటోంది. 'బాల్యకాల సఖి' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో మమ్ముట్టి సరసన ఇషా తల్వార్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మలయాళంలో పలు చిత్రాల్లో నటించిన మీనాకు అక్కడ మంచి గుర్తింపు ఉంది. దాదాపు మూడు, నాలుగేళ్ల తర్వాత మలయాళంలో ఆమె నటిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా కాకుండా మోహన్‌లాల్ భార్యగా ఓ చిత్రంలో నటిస్తున్నారు మీనా.

    ఇక, ఇటీవల విడుదలైన 'శ్రీ జగద్గురు ఆదిశంకర'లో ఆమె ఓ పాత్ర చేసిన విషయం తెలిసిందే. విద్యాసాగర్‌ని పెళ్లి చేసుకుని, ఓ బిడ్డకు తల్లయిన తర్వాత మీనా రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు వరుసగా సినిమాలు అంగీకరిస్తున్నారు కాబట్టి కెరీర్‌ని సీరియస్‌గా తీసుకుంటున్నారని ఊహించవచ్చు.

    మరో ప్రక్క మీనా డబ్బింగ్‌ ఆర్టిస్టుగా కొత్త అవతారమెత్తి తన పయనాన్ని సాగిస్తున్నారు. బాలనటిగా కెరీర్‌ను ప్రారంభించిన మీనా అప్పట్లో తెలుగు, తమిళంలో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా కొనసాగారు. రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, సత్యరాజ్‌, ప్రభు, అజిత్‌ వంటి అగ్రహీరోలతో ఆడిపాడి ప్రేక్షకులను విశేషంగా అలరించారు. వివాహానంతరం మీనా వెండితెరకు దూరమయ్యారు. ప్రస్తుతం బుల్లితెరపై హవా చాటుకుంటున్నారు. ఇదిలా ఉంటే కోలీవుడ్‌లో డబ్బింగ్‌ ఆర్టిస్టుగా తన కొత్త పయనాన్ని సాగిస్తున్నారు.

    సంచలనాత్మక విజయం సాధించిన 'మైనా' చిత్రంలో టైటిల్‌రోల్‌ పోషించిన అమలాపాల్‌కు తమిళంలో గాత్రాన్ని అందించింది మీనానే! సంభాషణల పరంగా మైనా పాత్ర బాగా అలరించిన నేపథ్యంలో ఆమెకు ఈ తరహా అవకాశాలూ బాగానే వస్తున్నాయట. ప్రస్తుతం శివాజీ గణేశన్‌ కుటుంబం నుంచి ప్రభు నట వారసుడిగా విక్రమ్‌ప్రభు తెరంగేట్రం చేయనున్న గుమ్కీలో హీరోయిన్‌ లక్ష్మీమీనన్‌కూ మీనా డబ్బింగ్‌ చెప్పింది.

    English summary
    Meena will be essaying the role of Mammootty's mother in the upcoming movie Balyakalasakhi. Directed by Pramod Payyannur, the movie is based on the novel Balyakalasakhi written by late Vaikom Muhammed Basheer. Isha Talwar plays the female lead in this movie. Mammootty is seen playing double role in this film. This is the first time Meena will be seen playing the role of Mammootty's mother. Meena was busy anchoring reality shows and was also a judge for various shows in television. The actress is now making a comeback and hope that the two movies with the two superstars are indeed going to boost up her career.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X