Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రీ ఎంట్రీ : స్టార్ హీరోకి తల్లిగా మీనా
వయసుకు తగ్గ పాత్రలు చేయడం సులువు కానీ ఇలా వయసుకు మించిన పాత్రలు మోయడం బరువే అంటున్నారు. దాంతో ఈ పాత్రను మీనా ఓ సవాల్‌గా తీసుకున్నానని అంటోంది. 'బాల్యకాల సఖి' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో మమ్ముట్టి సరసన ఇషా తల్వార్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మలయాళంలో పలు చిత్రాల్లో నటించిన మీనాకు అక్కడ మంచి గుర్తింపు ఉంది. దాదాపు మూడు, నాలుగేళ్ల తర్వాత మలయాళంలో ఆమె నటిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా కాకుండా మోహన్‌లాల్ భార్యగా ఓ చిత్రంలో నటిస్తున్నారు మీనా.
ఇక, ఇటీవల విడుదలైన 'శ్రీ జగద్గురు ఆదిశంకర'లో ఆమె ఓ పాత్ర చేసిన విషయం తెలిసిందే. విద్యాసాగర్‌ని పెళ్లి చేసుకుని, ఓ బిడ్డకు తల్లయిన తర్వాత మీనా రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు వరుసగా సినిమాలు అంగీకరిస్తున్నారు కాబట్టి కెరీర్‌ని సీరియస్‌గా తీసుకుంటున్నారని ఊహించవచ్చు.
మరో ప్రక్క మీనా డబ్బింగ్ ఆర్టిస్టుగా కొత్త అవతారమెత్తి తన పయనాన్ని సాగిస్తున్నారు. బాలనటిగా కెరీర్‌ను ప్రారంభించిన మీనా అప్పట్లో తెలుగు, తమిళంలో నెంబర్ వన్ హీరోయిన్గా కొనసాగారు. రజనీకాంత్, కమల్‌హాసన్, సత్యరాజ్, ప్రభు, అజిత్ వంటి అగ్రహీరోలతో ఆడిపాడి ప్రేక్షకులను విశేషంగా అలరించారు. వివాహానంతరం మీనా వెండితెరకు దూరమయ్యారు. ప్రస్తుతం బుల్లితెరపై హవా చాటుకుంటున్నారు. ఇదిలా ఉంటే కోలీవుడ్‌లో డబ్బింగ్ ఆర్టిస్టుగా తన కొత్త పయనాన్ని సాగిస్తున్నారు.
సంచలనాత్మక విజయం సాధించిన 'మైనా' చిత్రంలో టైటిల్‌రోల్ పోషించిన అమలాపాల్‌కు తమిళంలో గాత్రాన్ని అందించింది మీనానే! సంభాషణల పరంగా మైనా పాత్ర బాగా అలరించిన నేపథ్యంలో ఆమెకు ఈ తరహా అవకాశాలూ బాగానే వస్తున్నాయట. ప్రస్తుతం శివాజీ గణేశన్ కుటుంబం నుంచి ప్రభు నట వారసుడిగా విక్రమ్‌ప్రభు తెరంగేట్రం చేయనున్న గుమ్కీలో హీరోయిన్ లక్ష్మీమీనన్కూ మీనా డబ్బింగ్ చెప్పింది.