Salaar: ప్రభాస్ సలార్ చిత్రంలో మీనాక్షి చౌదరి... మీరేమైనా గుర్తు పట్టారా?

ఖాన్సార్‌ సామ్రాజ్యంలో సెలబ్రేషన్స్‌ జోరుగా కొనసాగుతున్నాయి. అదేనండీ భారీ వసూళ్లతో బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌ అందుకున్న 'సలార్‌' చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ టాప్‌ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా సలార్ మేనియానే ఎక్కువగా కొనసాగుతోంది. అయితే నెట్టింట్లో సలార్​తో పాటు 'గుంటూరు కారం' భామ మీనాక్షి చౌదరి కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆమె ఈ చిత్రంలో ఉన్నట్లు మీమర్స్​ ఫొటోలు దర్శనమిస్తున్నాయి. అదేంటి ఈ ఖిలాడీ భామ సలార్ చిత్రంలో ఎక్కడ ఉందా అని ఆలోచిస్తున్నారా? దాని గురించే ఈ కథనం..

పంజాబీ సొగసరి మీనాక్షి చౌదరి ప్రస్తుతం తెలుగులో మంచి అవకాశాలతో కెరీర్​లో ముందుకెళ్తోంది. టాలీవుడ్‌లో రెండు, మూడేళ్ల క్రితమే అరంగేట్రం చేసినప్పటికీ కాస్త ఆలస్యంగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. మొదట ఇచ్చట వాహనములు నిలుపరాదు చిత్రంలో నటించిన ఈ భామ ఆ తర్వా ఖిలాడీ, హిట్ 2 తన అందాన్ని ప్రేక్షకులకు పంచి పెట్టింది. ఇక మహేశ్​ బాబు సరసన 'గుంటూరు కారం'లో నాయికగా చోటు దక్కించుకొని ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుణ్‌ తేజ్‌, విశ్వక్‌ సేన్‌ చిత్రాల్లోనూ హీరోయిన్​గా ఎంపికైంది.

 Meenakshi Chaudhary in Prabhas Salaar Movie Meme Viral is Social Media

ఇదే ఊపులో ఇప్పటికే తమిళంలో ఓ సినిమా ఈ భామ దళపతి విజయ్‌ సరసన నటించే బంపరాఫర్‌ను దక్కించుకుంది. అయితే ఇదిలా ఉండగానే ఆమె ప్రభాస్ నటించిన సలార్​లోనూ ఆఫర్ దక్కించుకుందంటూ అప్పట్లో వార్తలు జోరుగా వచ్చాయి. ఆ తర్వాత వికీపడీయా కాస్ట్ అండ్ క్ర్యూలోనూ ఈమె ఫొటో దర్శనమిచ్చింది. దీంతో ఈమె సలార్​లో ఉందని అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత తాను ఆ చిత్రంలో నటించలేదంటూ ఆమె కూడా క్లారిటీ ఇచ్చింది. వికీపిడీయా నుంచి ఆమె ఫొటో కూడా తొలిగించేశారు.

ఇక ఆ తర్వాత ప్రభాస్ సలార్ రిలీజ్ కావడం, మీనాక్షి నటించిన గుంటూరు కారం రిలీజ్ కావడం కూడా జరిగిపోయింది. ఇదంతా పక్కనపెడితే ప్రస్తుతం సలార్​ ఓటీటీలో స్ట్రీమింగ్​ అవ్వడం ప్రారంభించుకుంది. టాప్ ట్రెండింగ్​లో దూసుకెళ్తోంది. సోషల్​ మీడియాలోనూ ఫుల్ ట్రెండింగ్ అవుతోంది. ఈ క్రమంలోనే కొంతమంది నెటిజన్లు అప్పటి సలార్ మీనాక్షి వార్తలను ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చారు. మీనాక్షి గురించి సరదాగా ట్రోల్​ చేయడం ప్రారంభించారు.

 Meenakshi Chaudhary in Prabhas Salaar Movie Meme Viral is Social Media

సలార్ సినిమా బ్యాక్​గ్రౌండ్ లేడీస్​లో ఎక్కడో ఒక చోట ఉండే ఉంటది లే, బొగ్గులో కనపడట్లేదేమో, కాటేరమ్మా ఫైట్ సీన్​లో ఉన్న లేడీస్​లో ఇదుగో అక్కడ ఉంది, అదుగో అక్కడ ఉంది ఉంటూ సరదాగా కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. కానీ నిజానికి ఆమె సినిమాలో నటించలేదన్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X