జూ ఎన్టీఆర్ ‘బాద్ షా’లో మరో సెక్సీబ్యూటీ!
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందుతున్న 'బాద్ షా' చిత్రంలో మరో సెక్సీ బ్యూటీని తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల శ్రీకాంత్ హీరోగా వచ్చిన 'దేవరాయ' చిత్రం సెక్సీగా తన అందాలు ప్రదర్శించిన మీనాక్షి దీక్షిత్‌ను ఈ చిత్రంలో గ్లామర్ పెర్ఫార్మెన్స్ కోసం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తర్వలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దూకుడు చిత్రం టైటిల్ సాంగులో మీనాక్షి అందాలు సినిమాకు బాగా ప్లస్సయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో కూడా ఆమెను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు శ్రీను వైట్ల.
ఈ చిత్రంలో కాజల్ మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై బండ్ల గణేష్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు శ్రీను వైట్ల 'బాద్ షా' చిత్రాన్ని ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ 'బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు. ఈ సినిమా మరో దూకుడు అవుతుందని, ఆ రేంజిని దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఫిల్మ్ నగర్ టాక్.
'బాద్ షా' సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, గోపీ మోహన్, కోన వెంకట్ స్క్రిప్టు రచయితలుగా పని చేస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు ఇతర సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.


Click it and Unblock the Notifications











