మీరాజాస్మిన్ పై బ్యాన్?

By Staff

Meera Jasmine
అదేంటో గాని మళయాళి ముద్దుగుమ్మ మీరాజాస్మిన్ రోజుకో రకంగా వార్తల్లోకి ఎక్కుతోంది. తాజాగా మళయాళ సినీ పరిశ్రమ ఆమెను బ్యాన్ చేసే నిర్ణయం తీసుకుంది. అక్కడ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (AMMA) ఫండ్స్ రైజ్ చేయటం కోసం 'Twenty:20' పేరుతో ఓ సినిమా నిర్మిస్తోంది. మళయాళ మెగా స్టార్స్ అంతా అందులో ఫ్రీ గా నటిస్తున్నారు. కానీ మీరా అలా ఉచిత ప్రదర్శనలకు ఒప్పుకోనంది.సినిమా చెయ్యనని కరాకండిగా చెప్పేసింది.

దాంతో కోపగించిన అక్కడి అసోసియేషన్ ఆమె సినిమాలపై బ్యాన్ పెట్టింది. ప్రస్తుతం ఆమె రాజశేఖర్ హీరోగా తెరకెక్కుతున్న కన్నడ రీమేక్ సినిమా 'గోరింటాకు' లో చెల్లి పాత్రను వేస్తోంది. దానికి కూడా ఆమె హీరోయిన్ గా రెగ్యులర్ గా తీసుకునే రెమ్యునేషన్ తీసుకుంది. అలా మీరా డబ్బు దగ్గర మొహమాటపడే మనిషి కాదు అంటున్నారు తెలిసిన వాళ్లు.

కరక్టే కాని ఆర్టిస్టులు పరిశ్రమ లో బ్రతుకుతూ ...ఎదుగుతూ ...లగ్జరీలు అనుభవిస్తూంటారు. అలాంటి దాని శ్రేయస్సు కోసం చిన్న సాయం కూడా చేయనంటే ఎలా అందుకే బ్యాన్ పెట్టాం అంటున్నారు వాళ్ళు.ఇలా ఈ విషయం చిత్రంగా సంచలనం సృష్టిస్తూ చర్చనీయాంసంగా మారింది. దాంతో కొంతమంది మన సీనియర్లు ఈ ఇష్యూ ని తెలుగుకు ఆపాదించి ఇక్కడ మన పరిశ్రమ లో అందరూ కలసి ఇగోలు వదులుకుని ఒకే సినిమాలో ఎప్పుడైనా నటిస్తారా...అదీ ఫ్రీగా . పోనీ మరాకిల్ గా జరిగినా ఇలా నటించను అన్న వారిని బ్యాన్ చేసే ధైర్యం అసోసియేషన్ కి ఉంటుందా అని నిట్టూర్పులు విడుస్తున్నారు. ఇది విన్న ప్రక్కనున్న వాళ్ళు గట్టిగా అనకండి పెద్దలు విన్నారంటే ఫుడ్డు ఉండదని వాళ్ళకు జాగ్రత్తలు చెపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X