వాటిపై నోరు విప్పేందుకు రెడీ.. మద్దతుగా నిలిచే వారెంతమంది.. సుశాంత్ సూసైడ్‌పై మీరాచోప్రా
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఎన్నో అంశాలపై చర్చలకు దారి తీస్తోంది. డిప్రెషన్ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని మొదటగా బయటకు వచ్చింది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తోన్నారు. సుశాంత్ మరణం వెనుకున్న కోణాలను విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ పెద్దలపై, సినీ మాఫియాపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తాజాగా మీరా చోప్రా సినిమా ఇండస్ట్రీలోని ఆత్మహత్యలపై సంచలన కామెంట్స్ చేసింది.

సుశాంత్ మరణంతో..
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14 ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. నాటి నుంచి బాలీవుడ్‌పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. నెపోటిజం కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు అంటే.. అది కొందరు చేసిన హత్యేనని ఆరోపిస్తున్నారు.

మేనేజర్ మృతితో..
సుశాంత్ మేనేజర్ దిశ సలియాన్ 14వ అంతస్థు నుంచి జారిపడి మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఘటనకు సంబంధించిన సుశాంత్‌కు నిజాలు తెలుసని, అందుకే అతడిని కొందరు హత్య చేసి ఉంటారని సోషల్ మీడియాలో కొన్ని కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మేరకు యువ హీరో సూరజ్ పంచోలిపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

స్పందించిన మీరా చోప్రా..
సుశాంత్ మరణ వార్తపై మీరా చోప్రా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సుశాంత్ మరణ వార్త మొదటగా వైరల్ కాగా.. ఓ నెటిజన్ మీరాను క్లారిటీ కోసం అడగటం.. సుశాంత్ ఎవరిని ప్రశ్నించడం తెగ వైరల్ అయింది. ఆపై కొద్దిసేపటికే మళ్లీ ఆ ట్వీట్‌ను డిలీట్ చేయడం, మరో ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఇన్ని రోజుల తరువాత మరోసారి సుశాంత్ మరణంపై ఓ కామెంట్ చేసింది.

నోరు విప్పేందుకు రెడీ..
ఈ ఇండస్రీలో నటీనటులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారో చెప్పేందుకు నోరు విప్పేందుకు నాతో పాటు ఎంతోమంది రెడీగా ఉన్నారు. వారిని చావు చివరి అంచుల వరకు తీసుకొచ్చే అంశాల గురించి చెప్పేందుకు సిద్దంగా ఉన్నారు. మనకు వ్యతిరేకంగా ఆ సిస్టమ్ ఎలా పని చేస్తుంది? కొందరు దర్శకులు మానసికంగా ఎలా హింసిస్తారు? తెలివైనా వారెవ్వరూ అలా చేయరు.. విద్య అనేది ఇక్కడ అధిక ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. నేను ఎప్పటి నుంచో అక్కడ ఉన్నాను.
Recommended Video

మద్దతుగా నిలిచేది ఎంతమంది?
అయితే ఇందులో పాయింట్ ఏంటంటే.. మనం నోరు విప్పితే ఎంత మంది మనకు మద్దతుగా నిలుస్తారు? నా వెనుక ఎంత మంది నిలుస్తారు?. సుశాంత్ ఆత్మహత్య తరువాత ఇదంతా ఆగిందా?.. లేదు. ఆ భయమే మనల్ని ఆ స్టెప్ తీసుకునేలా చేస్తుంది. అయితే అది కేవలం సినిమాలు, పని కోసం కాదు. ఇండస్ట్రీలో చాలా రకాల సమస్యలున్నాయి. అది మన ఆత్మ గౌరవం, డిగ్నిటీ, మన నియమాలు, మనశ్శాంతి ఇలా ఎన్నో ఉంటాయి.


Click it and Unblock the Notifications











