బాలకృష్టే నీకు కరెక్ట్.. ఆగని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోల్స్.. వైఎస్ జగన్‌కు మీరా చోప్రా ఫిర్యాదు

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తనను వేధించి తీరును, బెదిరింపులపై హీరోయిన్ మీరా చోప్రా ఇంకా ఫిర్యాదులు చేస్తూనే ఉంది. సోషల్ మీడియాలో వారు చేసిన ట్రోల్స్‌ను బయటపెడుతూ యాక్టివ్‌గా ఈ అంశాన్ని లైవ్‌లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నది. హైదరాబాద్ పోలీసులు, తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత.. తన ఫోకస్‌ను ఆంధ్ర ప్రదేశ్‌ పైకి మళ్లించారు. తాజాగా ఏపీలో కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తూ..

నీకు బాలయ్యే కరెక్ట్

నీకు బాలయ్యే కరెక్ట్


మీరా చోప్రా చాలా రకాలుగా ఈ వివాదాన్ని హైలెట్ చేయాలని ప్రయత్నిస్తుంటే కొందరు నెటిజన్లు ఇంకా మీరా చోప్రాపై కామెంట్లు పెడుతూనే ఉన్నారు. ఈ విషయంలో బాలకృష్ణ నీకు కరెక్ట్ పర్సన్. బాలయ్య ఎలా ట్రీట్ చేస్తారో తెలుసుకోవాలని ఉందా? సిగ్గులేని మనిషివి నువ్వు అంటూ కామెంట్లు వదిలారు.

నీ ఫేవరేట్ హీరోనే ఎన్టీఆర్‌ను

నీ ఫేవరేట్ హీరోనే ఎన్టీఆర్‌ను

ఇక నీ ఫేవరెట్ హీరో మహేష్ బాబు తన సినిమా వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్‌ను చీఫ్ గెస్టుగా పిలుస్తాడు. ఆ విషయం తెలుసుకో అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఈ అంశం తీవ్రంగా మారుతున్నప్పటికీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏ మాత్రం తగ్గినట్టు కనిపించడం లేదు. ఇలా హీరోల ఫ్యాన్స్ మధ్య కూడా ట్రోల్ యుద్ధం సోషల్ మీడియాలో కనిపిస్తున్నది.

యాక్టర్లను కూడా టార్గెట్ చేస్తున్నారు..

యాక్టర్లను కూడా టార్గెట్ చేస్తున్నారు..

ఇక తనపై వస్తున్న ట్రోల్స్ గురించి మీరా చోప్రా ట్విట్టర్‌లో స్పందించారు. నన్ను మాత్రమే కాదు.. ఇతర యాక్టర్లను కూడా వాళ్లు టార్గెట్ చేస్తున్నారు. సిగ్గులేని మనుషులు చేస్తున్న పనికి సారీ. మహిళలనే కాదు.. మిగితా ఎవరన్నా వారికి గౌరవం లేదు అంటూ తన ట్వీట్‌లో మీరా చోప్రా తెలిపారు.

కోవిడ్, ఇతర సమస్యలను వదిలేసి

కోవిడ్, ఇతర సమస్యలను వదిలేసి

ఎవరైతే నన్ను బూతులు తిడుతూ ట్రోల్స్ చేస్తున్నారో వారికి ఓ జీవితం ఉన్నట్టు కనిపించడం లేదనే ఒక్క విషయాన్ని చెప్పాలనుకొంటున్నాను. మనమంతా కోవిడ్ రూపంలో అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే.. ప్రజలంతా చావు బతుకుల్లో ఉంటే.. వీరికి మాత్రం ద్వేషించడం, బూతులు తిట్టడమే పనిగా పెట్టుకొన్నారు. కేవలం వాళ్ల ఫేవరేట్ హీరో నచ్చడం లేదనే ఓ కారణంగా ఇలా ట్రోల్స్ చేస్తున్నారు. ఓ సారి జీవితం గురించి ఆలోచించుకోండి అంటూ మీరా చోప్రా వెల్లడించారు.

Recommended Video

NTR Fans Trolls On Meerra Chopra || ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై మీరా చోప్రా పోలీస్ కేస్...!!
ఎపీ సీఎం, తానేటి వనితకు ఫిర్యాదు

ఎపీ సీఎం, తానేటి వనితకు ఫిర్యాదు

తనను వేధిస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్, మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనితకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసి మీరా చోప్రా మరో ముందడుగు వేశారు. నన్ను గ్యాంగ్ రేప్ చేస్తానని, యాసిడ్ ఎటాక్ చేస్తామని, బూతులు తిడుతూ మీ రాష్ట్రానికి సంబంధించిన వాళ్లు సైబర్ ఎటాక్స్ చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు. మీరు కూడా ఈ విషయంలో స్పష్టమైన దర్యాప్తు చేసి మహిళల భద్రతకు కట్టుబడి ఉంటారని, తగిన చర్యలు తీసుకొంటారని భావిస్తున్నాను అని ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X