ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలా బెదిరించారు.. మళ్లీ వివాదాన్ని రాజేస్తున్న మీరా చోప్రా

వాన, బంగారం వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న మీరా చోప్రా.. ఈ మధ్య వివాదాలతో సావాసం చేస్తోంది. అయితే సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్ అయింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు, మీరా చోప్రాకు లాక్ డౌన్ సమయంలో జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, మహిళా కమిషన్ వద్దకు ఈ గొడవ వెళ్లింది. కొన్ని రోజుల తరువాత అంతా సద్దుమణిగినట్టు అనిపించింది. అయితే మీరా చోప్రా తాజాగా చేసిన కామెంట్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది.

ఆ ఒక్క మాటతో..

ఆ ఒక్క మాటతో..

మీరా చోప్రా జూన్ 1న తన అభిమానులతో ట్విట్టర్‌లో చాట్ చేసింది. ఈ క్రమంలో పలు ప్రశ్నలకు సమాధానం చెప్పింది. అందులో తెలుగు నుంచి ఇష్టమైన హీరోగా మహేష్ బాబు పేరు చెప్పింది. అదే క్రమంలో జూ ఎన్టీఆర్ గురించి చెబుతూ.,. అతను ఎవరో తెలీదని, తాను ఆయన ఫ్యాన్‌ను కాదని పేర్కొంది.

బెదిరింపులు..

బెదిరింపులు..

ఎన్టీఆర్ ఎవరో తెలీదని చెప్పడంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ తెగ హర్ట్ అయ్యారు. ఇక ఫ్యాన్స్ అందరూ కలిసి ఆమెను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఆమెతో పాటు, కుటుంబ సభ్యులను సైతం దూషించారు. రేప్ చేస్తామని బెదిరించారు. అందర్నీ చంపేస్తామని హెచ్చరించారు. వీటిపై మీరా చోప్రా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు, జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

దుమారంలేపిన వివాదం..

దుమారంలేపిన వివాదం..


అప్పట్లో ఈ వివాదం పెద్ద దుమారాన్నే లేపింది. మీరా చోప్రా నెటిజన్ల ట్వీట్లను స్క్రీన్ షాట్లు తీసి.. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండి జాతీయ మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేసింది. తెలంగాణలో కేటీఆర్ స్పందించి.. తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చాడు.

తాజాగా మళ్లీ తెరపైకి..

తాజాగా మళ్లీ తెరపైకి..

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మీరా చోప్రాకు తాజాగా ఓ నెటిజన్ ఈ రకంగా ప్రశ్నించారు. ‘ఓ కమెడియన్‌కు వచ్చిన రేప్ బెదిరింపుల మీద మీరెందుకు నోరు విప్పడం లేదు మీరా చోప్రా?.. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారని చెబుతారుగా' అని సదరు నెటిజన్ ప్రశ్నించారు.

Recommended Video

Meera Chopra Vs Jr NTR Fans Issue Maybe A Political Game
నన్ను రేప్ చేస్తామని బెదిరించారు..

నన్ను రేప్ చేస్తామని బెదిరించారు..

సదరు నెటిజన్ ప్రశ్నకు బదులుగా మీరా చోప్రా స్పందిస్తూ.. ‘జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా నన్ను రేప్ చేస్తామని బెదిరించారు కానీ అలాంటిదేమీ జరగలేదు. దీన్ని బట్టి ఇండియాలో మహిళల రక్షణ సీరియస్‌గా తీసుకోలేదనిపిస్తోంది. జనాలు ఏం వాగుతున్నారో కూడా ఈ ట్విట్టర్ పట్టించుకోద'ని ఫైర్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X