పవన్ కళ్యాణ్ 'బంగారం'తో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన మీరా చోప్రా కి అప్పుడే సినిమా ఫీల్డ్ మొహం మొత్తినట్లుంది.తర్వాత ఎమ్.ఎస్.రాజు దర్శకత్వంలో చేసిన 'వాన' వర్కవుట్ కాలేదు.ఇక నితిన్ తో చేసిన 'సత్యం శివం సుందరం' డబ్బాల్లో మూలుగుతోంది.ఇక ఇప్పుడు ఆమె చేతిలో 'జగన్మోహిని'మాత్రమే ఉంది.తమిళ,తెలుగు భాషల్లో చేస్తున్న ఈ సినిమాలో నమిత మెయిన్ హీరోయిన్.ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడుతూ "ఈ సంవత్సరం చివరకు పెళ్ళి చేసుకుంటానని...తన భాయ్ ప్రెండ్ (డిల్లీ) తనకి అన్ని విధాలా నచ్చాడని,అతనిపై నమ్మకం ఉంద"ని చెప్తోంది.అలాగే వివాహం అనంతరం సినిమాలకు స్వస్తి చెప్పి మంచి గృహిణిగా సెటిల్ అవ్వాలని ఉందని అంటోంది.అంతేగాక తను సినిమాల్లోకి రాక ముందు చేపట్టిన జర్నలిజం వృత్తిని తిరిగి కొనసాగించాలని ఉందంటోంది.