ఒక్కరాత్రికి రేటెంత? నిన్నుచంపుతాం.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై పోలీసులకు మీరా చోప్రా ఫిర్యాదు
హీరోయిన్ మీరా చోప్రా, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మధ్య వివాదం ముదిరింది. మంగళవారం సాయంత్రం నుంచి మొదలైన ట్రోలింగ్ అదుపుతప్పింది. మీరాను టార్గెట్ చేస్తూ అసభ్య పదజాలం ఉపయోగిస్తూ బూతులతో ట్విట్టర్‌ను తారక్ అభిమానులు హోరెత్తించారు. దాంతో మీరా సైబరాబాద్ పోలీసులకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. మీరాచోప్రాకు చిన్మయితోపాటు పలువురు నెటిజన్లు అండగా నిలుస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

హర్ట్ అయిన ఎన్టీఆర్ ఫ్యాన్స్
పవన్ కల్యాణ్‌తో కలిసి బంగారం సినిమాలో నటించిన మీరా చోప్రా తాజాగా #askmeera అనే హ్యాష్ ట్యాగ్‌తో లైవ్ చాటింగ్‌కు వచ్చారు. ఆ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పండి అంటే.. నాకు ఎన్టీఆర్ తెలియదు. నాకు మహేష్ బాబు అంటే ఇష్టం అని చెప్పారు. దానికి హార్ట్ అయిన ఎన్టీఆర్ అభిమానులు తీవ్రస్థాయిలో ట్రోలింగ్ మొదలుపెట్టారు.

డబుల్ రేటు ఇస్తాను అంటూ
మీరాను టార్గెట్ చేస్తూ ఒక్కరాత్రికి నీ రేటెంత? నేను డబుల్ రేట్ ఇస్తాను? పోర్న్ మూవీస్‌లో ట్రై చేయి అంటూ దారుణంగా బూతులు తిడుతూ రచ్చ చేశారు. ఓ దశలో ఎన్టీఆర్‌పై కామెంట్ చేసినందుకు మీ అమ్మ, నాన్న కరోనాతో చనిపోవాలి అంటూ శాపనార్థాలు పెట్టారు. మంగళవారం రాత్రి అంతా ఆమెను ట్రోల్ చేస్తూనే ఉన్నారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పెట్టుకో
ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఘోరంగా మీరా చోప్రాను కామెంట్ చేశారు. మనోళ్లు దానికి ఇచ్చిన కోటింగ్‌కు, ఎన్టీఆర్ అంటే మాత్రమే కాదు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే కూడా తెలిసింది. ఆస్తులు ఉన్నోడితో పెట్టుకో.. అంతస్తులు ఉన్నోడితో పెట్టుకో.. అభిమానులు ఉన్నోడితో పెట్టుకోకు. ముఖ్యంగా మాలాంటి మాస్ అభిమానులు ఉన్నోడతో పెట్టుకోకు అంటూ వార్నింగ్ ఇచ్చారు.

చిన్మయి, నెటిజన్ల సపోర్టు
మీరా వివాదం కొనసాగుతున్న క్రమంలో గాయని చిన్మయితో పాటు చాలా మంది నెటిజన్లు కూడా మీరా చోప్రాకు మద్దతుగా నిలిచారు. అసభ్య పదజాలం ఉపయోగించడం సరికాదు. పోలీసులకు కంప్లయింట్ ఇవ్వమని సలహా ఇచ్చారు. ఎన్టీఆర్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోకు అమ్మాయిలు వెళ్లి చూడొచ్చు అనే ఫీలింగ్ ఉండేది. కానీ ఇలా చూస్తే భయమేస్తున్నది. హీరోలు ఇలాంటి ఫ్యాన్స్‌కు దూరంగా ఉండాలి అంటూ సలహా ఇస్తున్నారు.

ఎన్టీఆర్‌కు తెలియాలనే ట్యాగ్ చేశా
ఎన్టీఆర్ గురించి మీరా చోప్రా స్పందించారు. ఆయన అంటే నాకు అన్ని రకాలుగా రెస్పెక్ట్ ఉంది. కేవలం ఆయన ఫ్యాన్స్ చేస్తున్న వీరంగం తెలియడానికే ఎన్టీఆర్‌కు ట్యాగ్ చేశాను. ఫ్యాన్స్‌ను అదుపులో పెట్టడం ఆయన బాధ్యత. ఇలాంటి చెడ్డపనులకు దూరంగా ఉండాలని ఎన్టీఆర్ చెప్పాలి అని మీరా చోప్రా సూచించారు.
Recommended Video

సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు
ఇక మీరా చోప్రా ట్రోల్స్‌పై హైదరాబాద్ సిటీ పోలీసులకు, సైబర్ క్రైమ్ హైదరాబాద్ వారికి ఫిర్యాదు చేశారు. నాపై దారుణంగా ట్రోల్ చేస్తున్న అకౌంట్లు ఇవి. నాపై సామూహిక దాడికి పాల్పడాలనే విధంగా మాట్లాడుతున్నారు. నన్ను బూతులు తిడుతున్నారు. చంపుతామని బెదిరిస్తున్నారు. వారంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావడం దురదృష్టకరం అంటూ ఆన్‌లైన్‌లో మీరా చోప్రా ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











