మీరాచోప్రా మూన్నాళ్ల ముచ్చట
బంగారం చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మీరా చోప్రా చాలా విరామం తర్వాత జగన్మోహిని చిత్రంలో యువరాణిలా నటిస్తోంది. బంగారం, వాన, చిత్రాల తర్వాత మంచి అవకాశాలు లేక, తమిళ ఇండ్రస్ట్రీలో కాలు మోపింది అక్కడ కూడా చేదు అనుభవం ఎదురుకావడంతో సినిమా ఇండస్ట్రీపై విసుగు చెంది ఇకపై సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకుందని సమాచారం అందుతోంది. ఇదే నిజమైతే జగన్మోహిని మీరాచోప్రాకి చివరి చిత్రం అవుతుంది.
ఈ మధ్య ఎక్స్ పోజింగ్ సైతం సై అంటూ హాట్ హాట్ గా కనిపించినా లాభం లేకపోయిందని ఆలస్యంగా తెలుసుకొన్నదికాబోలు. అందుకే సినిమాలకు స్వస్తి చెప్పాలని అనుకొంటున్నట్టు సన్నిహితుల ద్వారా తెలిసింది. ఇటీవల సినిమాలో హీరోయిన్ గా మీరాచోప్రాను బుక్ చేసుకునేందుకు ఓ నిర్మాత ప్రయత్నించినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సినిమా లో అవకాశాలు లేవని కలత చెందక తన దృష్టిలో సినిమానే ప్రపంచం కాదు. దాన్ని మించిన లోకం చాలా పెద్దది అంటూ భారీ డైలాగులు చెబుతోంది. దాంతో విదేశాలలో హొటల్ బిజినెస్ కలిగిన మీరాచోప్రా ఇండియాలోనూ ఆ వ్యాపారాన్ని విస్తరించాలని ప్రణాళికలు సిద్ద చేసుకొంటోందట. ఈ అందాల భామాకు డిల్లీలో 'మిరాజ్" పేరిట ఒక హూటెల్ ను ప్రారంభించిందంటా. మరి మీరా అదృష్టం బిజినెస్ రంగంలో ఎంత వరకో వేచిచూడాలి?!


Click it and Unblock the Notifications











