మళ్ళీ 'మీరా చోప్రా'

ఇక ఈ కొత్త చిత్రంలో ఆమె 'గమ్యం' తో పాపులర్ అయిన శర్వానంద్ సరసన నటించబోతుంది. ఈ చిత్రం పూర్తి ప్రేమకథా నేపథ్యంలో, ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందని సమాచారం. ఇంతకు ముందు చంద్రసిద్ధార్ధ 'ఇదీ సంగతి' సినిమాతో ఫ్లాఫులలో ఉన్నాడు. ఆయనకీ ఈ సినిమాపై చాలా ఆశలు ఉన్నాయి. మరో ప్రక్క మీరా చోప్రా తమిళ సినిమాల్లో నీల పేరుతో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. ఆమె తమిళంలో అర్జున్ హీరోగా నటించిన చిత్రం "సింగమలై" పేరుతో ఇక్కడా రిలీజైంది. అలాగే ఆమె ప్రస్తుతం తమిళ చిత్రం 'ఖిలాడీ' షూటింగ్ లో ఉంది.


Click it and Unblock the Notifications











