మీరాజాస్మిన్ కు మోక్షం డిసెంబర్ లోనే

By Srikanya

మీరాజాస్మిన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మోక్ష' ఎట్టకేలకు విడుదలకు రెడీ అయింది.చాలా కాలం క్రిందటే షూటింగ్ పూర్తి అయినా బిజెనెస్ సమస్యలో ఉన్న ఈ చిత్రం చివరకు డిసెంబర్ లో రిలీజ్ చేయటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.శ్రీకాంత్ వేములపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ అమరనాథన్ మూవీస్ పతాకంపై ప్రొద్దుటూరి అమర్‌నాథ్ రెడ్డి నిర్మిస్తున్నారు.ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ "మీరాజాస్మిన్ తొలిసారిగా నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రమిది. హారర్ కథాంశంతో తెరకెక్కుతోంది.ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఈ కాన్సెప్ట్‌తో ఏ భాషలో ఇటువంటి చిత్రం రాలేదు. పూర్తిగా నవ్యమైన నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని వర్గాలను అలరించే అంశాలుంటాయి.త్వరలోనే ఆడియో విడుదల చేసి వచ్చే నెల్లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తాం. మీరాజాస్మిన్ నటన చిత్రానికి ప్రధాన హైలైట్''అన్నారు.

మోక్ష' లో మీరా జాస్మిన్ వేంపైర్ గా కనిపించనుందని సమాచారం. ఓ ప్రెంచ్ క్లాసిక్ హర్రర్ చిత్రం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ హారర్‌ చిత్రమిది. రాజీవ్‌ మోహన్‌, దిశపాండే ఇందులో జంటగా నటించారు. శ్రీకాంత్‌ వేములపల్లి దర్శకత్వంలో పి.అమర్‌ నాథ్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మీరా జాస్మిన్‌ నటిస్తున్న తొలి థ్రిల్లర్‌ చిత్రమిదినీ, ఇందులో ఆమె పాత్ర ఎంతో కీలకం అనీ, గ్రాఫిక్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఉన్న కథ ఇది నిర్మాత చెప్తున్నారు. నాజర్‌, రాహుల్ ‌దేవ్‌, సన, వహిదా, కాదల్‌ సుకుమార్‌, విజయ్ ‌భాస్కర్‌, సుమన్ ‌శెట్టి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్‌ ఆర్‌.పి, సమర్పణ: శ్రీమతి పి.హిమబిందు, నిర్మాణం: అమర్ ‌నాథన్‌ మూవీస్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X